ప్రైడ్ తెలుగు న్యూస్ – వెబ్ సిరీస్ – రివ్యూ – కొరియన్ డ్రామా – క్వీన్ ఆఫ్ టియర్స్

రివ్యూ – వెబ్ సిరీస్

పేరు – క్వీన్ ఆఫ్ టియర్స్

ఎప్పుడు రిలీజైంది 2024

ఎక్కడ చూడవచ్చు – నెట్ ఫ్లిక్స్ లో..

ఎన్ని భాగాలు – 16 భాగాలు

నిడివి ఎంత .. చూడండి తెలుస్తుంది.

బాగుందా.. చాలా బాగుంది..

హైలైట్స్ – హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, వీరిద్దరి స్క్రీన్ ప్రసెన్స్

కొరియన్ డ్రామాలకు , పాన్ ఇండియా వైడ్ గా ఆడియెన్స్ పెరుగుతున్నారు. ఇప్పటికే చాలా  సిరీస్ లు చూసేసారు. అయితే నెట్ ఫ్లిక్స్ లో గత ఏడాది (2024 ) విడుదలైన, కొరియన్ రొమాంటిక్ కామెడీ సిరీస్ గురించి ఎంతమందికి తెల్సు.. ఈ వెబ్ సిరీస్ పైరు క్వీన్ ఆఫ్ టియర్స్. మొదటి ఎపిసోడ్ స్టోరీ రివ్యూ మాత్రమే ఇక్కడ ఇస్తున్నాం.. ఇక్కడ రివ్యూ ఇస్తున్నాం అంటే, మీరు తప్పక చూడాల్సిన వెబ్ సిరీస్ లో ఒకటని అర్ధం.

ఇద్దరు ప్రేమికులు. కాని ప్రియుడు పేదోడు. ప్రియురాలు మాత్రం లక్షల కోట్లకు బిజినెస్ కు ఓనర్. కాని తన కంపెనీలో సామాన్య ఉద్యోగిగా జాయిన్ అవుతుంది. అక్కడే హీరో చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలియని హీరో, ఆమెకు పనులకు సాయం చేస్తుంటాడు. ఇష్టం లేకుండా ఆమె చేస్తోన్న ప్రతి పనిని సరిదిద్దుతుంటాడు. మెళ్లిగా తనకు  తెలియకుండానే ప్రేమలో పడతాడు.

ఒక పూర్ గాయ్, రిచ్ గర్ల్ తో ప్రేమలో పడతాడు.. మరి హీరోయిన్ పరిస్థితి ఏంటి.. హీరోయిన్ కూడా మొదట అయిష్టంగానే ఉంటుంది. కాని ఆఫీస్ లో తన  టాలెంట్, బిహేవియర్ చూసి ప్రేమలో పడుతుంది. తర్వాత తాను  కాంపెనీకి ఓనర్ ను అని చెబుతుంది.

అయితే తనకు మాత్రం ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను అంటూ ప్రియుడ్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటుంది. మొదట మూడు నెలలు బాగానే ఉంటారు. ఆ తర్వాత గొడవలు ప్రారంభం అవుతాయి. కంబైన్డ్ కుటుంబంలో హీరోకు రెస్పెక్ట్ తగ్గుతుంది. పైగా ఇల్లరికం వెళ్లడంతో, ఆ ఇంట్లో హీరోను ఇంకా చులకనగా చూస్తారు. ఇక లాభం లేదనుకుని హీరోయిన్ కు విడాకులు ఇవ్వాలి అనుకుంటాడు హీరో.. అందుకే విడాకుల నోటీసులు తీసుకుని హీరోయిన్ దగ్గరకు వెళ్తారు.

ఆ తర్వాత తనకు ఒక భయంకమైన విషయం తెలుస్తుంది. అక్కడికక్కడే విడాకుల నోటీసును పక్కనపెట్టేస్తాడు. హీరోయిన్ తో మళ్లీ ప్రేమలో పడతాడు. ఇంతకీ ఆ భయంకరమైన నిజం ఏంటి, అప్పటి వరకు హీరోయిన్ పై కారాలు మిరియాలు నూరిన హీరో ఎందుకు మారిపోతారు.. హీరోయిన్ పై ప్రేమ ఎందుకు కురిపిస్తాడు.. అనేది మీరు ఎపిసోడ్ చూసి తెల్సుకోవాల్సిందే..

రెండో భాగం కథలో మళ్లీ కలుద్దాం.

ప్రైడ్ తెలుగు న్యూస్ – వెబ్ సిరీస్ – రివ్యూ – కొరియన్ డ్రామా – క్వీన్ ఆఫ్ టియర్స్

ఇవి కూడా చదవండి

error: Content is protected !!