ఇప్పుడంటే తమిళనాట లోకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. కాని కెరీర్ ప్రారంభంలో అంటే, మానగరం చూసి అతనిలో టాలెంట్ ఉందని నమ్మి ఖైదీ అనే చిత్రం తీసే అవకాశం ఇచ్చాడు కార్తి. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. లోకేష్ కనగరాజ్ అనే దర్శకుడి పేరు తెలుగు, తమిళ భాషల్లో మార్మోగిపోయింది. అలాంటి దర్శకుడు కార్తికి ఎంత ఋణపడి ఉండాలి.

కాని లోకేష్ కనగరాజ్ స్టార్ డమ్ అందుకున్న తర్వాత కార్తిని మర్చిపోయాడు. తనతో తీయాల్సిన ఖైదీ -2 కథను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వెళ్లాడు. ఒకసారి విజయ్ పిలిచాడు మాస్టర్ కోసం అన్నాడు. తర్వాత తన ఫేవరేట్ హీరో కమల్ పిలిచాడు అని విక్రమ్ చేసాడు. తర్వాత లియో, ఆ తర్వాత కూలీ, ఇప్పటికీ ఖైదీ సీక్వెల్ గురించి ముచ్చటే లేదు. అదేంటి అంటే ప్రస్తుతం ఆమిర్ ఖాన్ తో సూపర్ హీరో మూవీ తీసేందుకు రెడీ అవుతున్నాడు.

అందుకే కార్తికి కోపం వచ్చింది. అన్నగారు వస్తారు సినిమా ప్రమోషన్స్ లో ఖైదీ సీక్వెల్ గురించి అడిగితే నాకు దాని గురించి ఏం తెలియదు అనేసాడు. కార్తి మాటల బట్టి, లోకేష్ కు, కార్తికి దూరం పెరిగింది. ఇప్పుడు ఎవరి దారుల్లో వారు వెళ్లాలని నిర్ణయించుకున్న విషయం అర్దం అవుతుంది. అయితే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఈ యూనివర్స్ ఫ్యాన్స్ కు బాధను కలిగిస్తోంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ హీరోగా మారి డీసీ అనే మూవీ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!