కన్నప్ప విజయం పై, విష్ణు ఎందుకంత నమ్మకంగా ఉన్నాడో తెలియదు కాని, సినిమా రిలీజ్ కు ముందు నాన్ థియేట్రికల్ బిజినెస్ కు దూరంగా ఉన్నాడు. అంటే శాటీలైట్,ఓటీటీ రైట్స్ ను ఎవరికి అమ్మలేదు. ఇప్పుడు రిలీజ్ తర్వాత, ఈ సినిమా మంచి విజయం సాధించడం, పైగా పాన్ ఇండియా స్టార్స్ అందరూ నటించడంతో, మంచి వ్యాపారం జరుగుతోంది. ఆల్రెడీ నార్త్ మార్కెట్ నుంచి హిందీ వర్షన్ శాటీలైట్ రైట్స్ 20 కోట్లకు అమ్ముడు అయ్యాయట. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది.

ఇంకా ఓటీటీ డీల్ మిగిలే ఉంది. దానికి కూడా మంచి ఆఫర్ వస్తే మాత్రం, మంచు విష్ణు ప్లాన్ బ్రహ్మాండంగా వర్క్ అవుట్ అయినట్లే.. ముందే ఓటీటీ డీల్ కుదుర్చుకుని, వారు చెప్పిన డేట్ కు మూవీని రిలీజ్ చేసే టెన్షన్ కంటే, ఇలా చేయడం ఉత్తమం. అప్పుడు మన చిత్రం మన చేతుల్లోనే ఉంటుంది. కాన్ని అందరికి, లేదా అన్ని సినిమాలకు ఇలాంటి బిజినెస్ మోడల్ వర్క్ అవుట్ అవ్వదుగా…

ఇవి కూడా చదవండి

error: Content is protected !!