
ఎందుకో తెలియదు కాని మేకర్స్, ప్రభాస్, కరీనా కాంబినేషన్ కోసం ట్రై చేస్తున్నారు. నిజానికి సందీప్ వంగా తాను తెరకెక్కించే స్పిరిట్ లో లేడీ విలన్ రోల్ కోసం కరీనా కపూర్ ను సంప్రదించాడు. కాని ఆమె నో చెప్పేసింది. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కు బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు మారుతి రంగంలోకి దిగాడు తాను తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రం రాజాసాబ్ లో, కరీనా కపూర్ తో స్పెషల్ సాంగ్ చేయించాలి అనుకుంటున్నాడు.
కరీనా కపూర్ స్పెషల్ సాంగ్స్ చేయడం పెద్ద విశేషం కాదు. కాని ఇది తెలుగు చిత్రం.. తాను చేస్తుందా లేదా అన్నదే సందేహం. గతంలో దబాంగ్ -2లో సల్మాన్ కోసం ఫేవికాల్ సే అనే స్పెషల్ సాంగ్ చేసింది. అదీ సల్మాన్ పై అభిమానంతో చేసింది. కాని కెరీర్ మొత్తం చాలా స్పెషల్ సాంగ్స్ చేసినప్పటికీ, అవి కూడా సెలక్టెడ్ గా ఉంటాయి. ఇక హిందీ ఇండస్ట్రీ దాటి టాలీవుడ్ కోసం స్పెషల్ సాంగ్ అంటే, కరీనా అంత త్వరగా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది డౌటే..
ఈ మధ్య కాలంలో కరీనా కపూర్ చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా, క్రేజ్ మాత్రం అదే స్థాయిలో కొనసాగుతోంది. బాలీవుడ్ లో ఇఫ్పటికీ టాప్ స్టార్. కాబట్టి ప్రభాస్ మూవీలో తాను స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంటే మాత్రం, తెలుగు సినీ పరిశ్రమకు వచ్చేందుకు కరీనా సిద్ధమవుతున్నట్లు లెక్క. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ హారర్ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పుడు స్పెషల్ కోసం ఏకంగా కరీనా డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు.తమన్ ఒక ఎలక్ట్రిఫైయింగ్ స్పెషల్ సాంగ్ కంపోజ్ చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి