
ఇండియన్ సినిమాలో, మరీ ముఖ్యంగా కన్నడ సినీ ప్రపంచంలో, తిరుగులేని విజయాన్ని అందుకున్న చిత్రాలు కేజీయఫ్. రెండు భాగాలు, ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్ల వసూళ్లు. ఈ సినిమాలకు ఇంత క్రేజ్ రావడానికి మొదట దర్శకుడు ప్రశాంత్ నీల్ విజన్, మరొకటి స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన యశ్. వీరిద్దరు లేకపోతే కేజీయఫ్ సిరీస్ లేదు. అలాంటి కేజీయఫ్ డైరెక్టర్ పై హీరో యశ్ ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
అసలు నీల్ కు స్టోరీ చెప్పడమే రాదట. నీల్ కథ చెబితే నిద్ర వస్తుందట. కాని మెగా ఫోన్ పట్టుకుంటే, అద్భుతాలు చేస్తాడు. నిజానికి కథ చెప్పడంలోనే ఒక దర్శకుడి టాలెంట్ ఏంటి అనేది ఆధారపడి ఉంటుంది. అలాంటిది కథ చెప్పడం రాకపోయినా, ఎగ్జిక్యూషన్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్నాడు నీల్.
ముందు కేజీయఫ్ సిరీస్, ఆ తర్వాత సలార్, ఇప్పుడు డ్రాగన్.. అన్ని కూడా పాన్ ఇండియా ప్రాడక్ట్స్. అయితే యశ్ చెప్పినట్లు చూస్తే, ప్రభాస్, ఎన్టీఆర్ కూడా నీల్ చెప్పిన కథలు వినకుండానే అతని దర్శకత్వంలో నటించేందుకు రంగంలోకి దిగారా అనే అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రశాంత్ నీల్ మూవీస్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ తో డ్రాగన్ రిలీజ్ కాగానే, సలార్ సీక్వెల్, అలాగే కేజీయఫ్ -3 ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి.
ఇది కూడా చదవండి
