ఇండియాలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్నిటి డ్రీమ్ ఒక్కటే అదే 1000 కోట్ల సినిమా. టాలీవుడ్ లీడింగ్ లో ఉంది. బాహుబలి 2, పుష్ప 2, త్రిబుల్ ఆర్, కల్కి. ఇక బాలీవుడ్ దంగల్, పఠాన్, జవాన్ చిత్రాలతో వెయ్యి కోట్ల కలను తీర్చుకుంది. శాండల్ వుడ్ కూడా కేజీయఫ్ 2 తో వెయ్యి కోట్ల వసూళ్లను చూసింది. ప్రస్తుతం కాంతార -2తో ఆ రికార్డ్స్ ను మరోసారి చూడాలనుకుంటోంది. కాని కోలీవుడ్ మాత్రం ఇంకా 500 కోట్ల దగ్గరే ఆగిపోతోంది. హిట్టైన సినిమా, రజనీకాంత్ నటించిన మూవీ, ఏదైనా 500 లేదా 600 కోట్ల మార్క్ దగ్గరే ఆగిపోతోంది.

ఇలా ఎందుకు మదరాసి అని, శివకార్తికేయన్ ను అడిగితే అందుకు చాలా రీజన్స్ చెప్పాడు. ముఖ్యంగా టికెట్ రేట్స్ అన్నాడు. తర్వాత నార్త్ మార్కెట్ లోకి తమిళ సినిమా చొచ్చుకెళ్లకపోవడం, నాలుగంటే నాలుగు వారాల్లో సినిమా ఓటీటీలోకి వచ్చేయడం, అలా కాకుండా 8 వారాలు ఓటీటీ గ్యాప్ పెట్టుకుని, మూవీని నార్త్ లో రిలీజ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అంటున్నాడు శివకార్తికేయన్. కూలీ రిలీజ్ కు ముందు ఈ చిత్రం వెయ్యి కోట్లు కొల్లగొడుతుందని అందురూ ఊహించారు. కాని కుదరలేదు. ఇప్పుడు ఈ కలను జైలర్ సీక్వెల్ నిజం చేస్తుందని తమిళ సినీ పరిశ్రమ చాలా ఆశలే పెట్టుకుంది.

ఇంత స్టోరీ చదివిన తర్వాత, ఇంతకీ బాక్సాఫీస్ దగ్గర మదరాసి పరిస్థితి ఏంటి అంటే, వచ్చే ఆన్సర్ ఫ్లాప్. సినిమా రిలీజైన ఫస్ట్ వీకెండ్ బాగానే వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా 70 కోట్ల లోపే కలెక్షన్స్ చూసాడు మదరాసి. మండే నుంచి కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి. మురుగదాస్ కు మరోసారి నిరాశే ఎదురైంది.  దాదాపు 180 కోట్లతో తెరకెక్కింది మదరాసి.           

ఇవి కూడా చదవండి 

error: Content is protected !!