
ఎలా రష్మిక అలా, ఏ సినిమా చేస్తే, ఆ సినిమా హిట్టు.ఏ ఇండస్ట్రీకి వెళ్తే, ఆ ఇండస్ట్రీలో హిట్టు, ఎవరితో నటించినా హిట్టు, ఎలా నటించిన హిట్టు, ఇది రష్మికకు మాత్రమే తెల్సిన సీక్రెట్టు.
రష్మిక నటించిన సినిమా అంటే చాలు, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోతోంది. ఏదో ఒకసారి జరిగితే వేరు, ఆమె కనిపించిన ప్రతీసారి అదే రిపీట్ అవుతోంది. బాక్సాఫీస్ పై కాసుల వర్షం కురుస్తోంది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతోంది. డిస్ట్రీబ్యూటర్స్ ముఖంలో నవ్వు తెప్పిస్తోంది. ఎగ్జిబీటర్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇలాంటి వసూళ్లు, ఇలాంటి రికార్డులు, ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి రోల్స్, ఇలాంటి మూవీస్, ఇలాంటి కాంబినేషన్స్, ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి.. ఇలా చెప్పుకుంటే వెళ్తే చాలా చెప్పాలి.
ఎక్కడ మొదలు పెట్టాలి. పుష్ప సిరీస్ లో కనిపిస్తే, అది ప్యాన్ ఇండియాను షేక్ చేసింది. రెండు భాగాలు కలిపి రెండు వేల కోట్లు కొల్లగొట్టాయి. యానిమల్లో కనిపిస్తే అది వెయ్యి కోట్ల వసూళ్లను అందుకుంది. ఇక ఛావా చేస్తే అది బాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. సీతారామం ఈ తరం క్లాసిక్ గా మారింది. తమిళంలో విజయ్ తో వారీసు చేస్తే అది కూడా సూపర్ హిట్.
ఇప్పుడు లేటెస్ట్ గా కుబేర. ఈ చిత్రంలో రష్మిక నటన మరోసారి హైలైట్ గా నిలిచింది. కథకు తగ్గట్లు తన పాత్రలోకి ఒదిగిపోయి నటించింది రష్మిక. కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుంది. ఇండియన్ సినిమా లో చాలా మంది స్టార్ హీరోయిన్స్ వచ్చారు.. వెళ్లారు.. కాని రష్మిక క్రియేట్ చేస్తోన్న బాక్సాఫీస్ వండర్స్ మాత్రం, ఏ తరంలో హీరోయిన్స్ కు కూడా సాధ్యపడలేదు. అమె ఒక అవుట్ స్టాండింగ్ హీరోయిన్.
ఇది కూడా చదవండి