భారతీయ సినిమా తెరకెక్కించే ప్రేమకథ ఎంత గొప్పగా ఉంటుంది అంటే, పరాయి దేశం ఆ ప్రేమకథలో కనిపించిన ప్రధాన తారల బొమ్మను, తమ దేశంలో ఏర్పాటు చేయాలి అనే విధంగా ఉంటుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ,ఇదే నిజం.

30 ఏళ్ల క్రితం విడుదలైన దిల్ వాలే దుల్హనియా లేజాయింగేలో, షారుఖ్, కాజోల్ తో ఎక్కడ ప్రేమలో పడతాడు. లండన్ లో, ఇప్పుడు అదే లండన్ లో, ఈ సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో, దిల్ వాలే అలాగే దుల్హనియా విగ్రహాలు పెడతారట. ఒక ఇండియన్ సినిమాకు ఇంతకంటే గౌరవం ఏముంటుంది చెప్పండి.

30 ఏళ్ల క్రితం 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన డీడీఎల్ జే అప్పట్లోనే వంద కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ముంబైలోని మరాఠా మందిర్ లో ఇప్పటికీ చిత్రాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.  ఇంతటి ఘనత అందుకున్న అరుదైన ప్రేమకథ, ఈ ఏడాది అక్టోబర్ తో 30 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగానే లండన్ లో విగ్రహాల ఏర్పాటు చేయబోతున్నారు. ఇది నిజంగా షారుక్,అండ్ కాజోల్ అభిమానులకు పండగ లాంటి వార్త.

error: Content is protected !!