తమిళ నాట వరుస విజయాలతో, కోలీవుడ్ రాజమౌళిగా పేరు తెచ్చుకున్నాడు లోకేష్ కనగరాజ్. ఈ విషయాన్ని ఇటీవల కూలీ ప్రమోషన్స్ లో,  సాక్షాత్తు రజనీకాంత్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో ఎలా అయితే కెరీర్ బిగినింగ్ నుంచి రాజమౌళి అపజయం అన్నది లేకుండా దూసుకుపోతున్నారో, తమిళంలో ఖైదీ, విక్రమ్, లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అలాగే అపజయం అన్నది లేకుండా దూసుకుపోతున్నాడని, అందుకే తను కోలీవుడ్ రాజమౌళి అన్నాడు సూపర్ స్టార్.

తమిళ సినీ పరిశ్రమ స్థాయిని పెంచే దర్శకుల్లో ఒకడిగా లోకేష్ కనగరాజ్, ఇప్పుడు అక్కడ టాప్ పోజీషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. కూలీ రిలీజ్ తర్వాత ఖైదీ 2 తెరకెక్కిస్తానంటున్నాడు. ఆ తర్వాత ఆమిర్ ఖాన్ తో సూపర్ హీరో మూవీ ప్రారంభించాలి. ఇంకా విక్రమ్ సీక్వెల్, రోలెక్స్ లాంటి మూవీస్, ఈ డైరెక్టర్ తెరకెక్కించాల్సి ఉంది. అలాగే విజయ్ సినిమాల్లో నటించాలని ఫిక్స్ అయితే మాస్టర్ సీక్వెల్, లియో సీక్వెల్ కూడా తెరకెక్కిస్తానంటున్నాడు. తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఇంత బిజీ డైరెక్టర్ మరొకరు లేరు.

ఇలాంటి డైరెక్టర్ ను ఇప్పుడు హీరోను, విలన్ చేసే పనిలో ఉంది తమిళ సినీ పరిశ్రమ. ఆకాశం నీ హద్దురా డైరెక్టర్ సుధా కొంగర తాను తెరకెక్కించే కొత్త చిత్రం పరాశక్తిలో విలన్ రోల్ కోసం మొదట లోకేష్ ను అడిగింది. అయితే చేతిలో కూలీ ప్రాజెక్ట్ ఉండటంతో నో చెప్పాడట లోకేష్. అయితే ఇప్పుడు కూలీ రిలీజ్ కు రెడీ అవుతుండటం, ఖైదీ2 తెరకెక్కేందుకు సమయం ఉండటంతో, లోకేష్ ను హీరోగా చేసేందుకు ఓ తమిళ దర్శకుడు డేట్స్ లాక్ చేసాడు. గతంలో ధనుష్ హీరోగా నటించిన క్యాప్టెన్ మిల్లర్ మేకర్, అరుణ్ మాథేశ్వరన్ ఇప్పుడు లోకేష్ ముఖ్యపాత్రలో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ రానుంది.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!