
ఇంకా సగం సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. పైగా రాజమౌళి సినిమా అంటే,
దేవుడు దిగి వచ్చి కూడా రిలీజ్ డేట్ చెప్పలేడు. మీరు ఎలా చెబుతున్నారు అంటారా.. ప్రపంచం మారిపోతోంది. సినిమా కూడా ఎప్పటికప్పుడు మారిపోతోంది. ఈ దశలో ఏళ్లకు ఏళ్లు ట్రెండ్ నడవదు. అందుకే రాజమౌళి కూడా మారిపోయాడు. మహేష్ తో మూవీని ఏడాదిలో కంప్లీట్ చేస్తానంటున్నాడు.
అంటే 2026లోనే షూటింగ్ పూర్తి అవుతుంది. 2027లో మూవీ రిలీజ్ అవుతుంది. 2027లో అది కూడా మార్చిలో మూవీని రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారట. గతంలో అంటే 2022లో త్రిబుల్ ఆర్ మూవీని, రాజమౌళి మార్చి 25న రిలీజ్ చేసాడు. ఇప్పుడు మహేష్ మూవీని కూడా సేమ్ డేట్ కు రిలీజ్ చేయాలి అనేది జక్కన్న ప్లాన్. ఎలాగూ సినిమాను సింగిల్ పార్ట్ గా తీస్తున్నాడు. ఇంకెందుకు ఆలస్యం అనుకుంటున్నాడు.
త్వరలో ఓ మంచి వీడియోతో సినిమా కంటెంట్, అలాగే రిలీజ్ డేట్ ప్రకటించేస్తాడట. అదే నిజమైతే అంతకంటే ఏం కావాలి అంటున్నారు రాజమౌళి అండ్ మహేష్ అభిమానులు.