
అదేంటి రాజమౌళితో సినిమా చేస్తోన్న హీరోకు కదా.. నిద్రపట్టకుండా ఉండాలి.. రాజమౌళికి నిద్రపట్టదు అని హెడ్డింగ్ పెట్టారు ఏంటి అంటారా.. రాజమౌళి ఏదైనా తట్టుకుంటాడు కాని, చిత్ర యూనిట్స్ నుంచి లీక్స్ ఒప్పుకోడు. తాను దర్శకత్వం వహిస్తోన్న సినిమాకు సంబంధించి, చిన్న ఫోటో లీకైనా రాజమౌళి ఊరుకోడు. అతని రక్తం మరిగిపోతుంది. అలాంటిది మహేష్ తో తెరకెక్కిస్తోన్న సినిమాకు సంబంధించి, ఒక ఫుల్ సీన్ లీక్ అయిపోయింది.
పూర్తిగా డిఫరెంట్ లుక్ తో ఉన్న మహేష్, అక్కడే చైర్ లో కూర్చున్న వ్యక్తి ముందు బెండ్ కావడం, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిత్ర యూనిట్ కు షాక్ ఇచ్చింది. చాలా చిన్న యూనిట్ తో రాజమౌళి ప్రస్తుతం ఒడిశా పరిశర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నాడు. రాజమౌళి సినిమా షూటింగ్ అంటే సెట్ లోకి ఫోన్స్ అనుమతి ఉండదు. మరి ఫుల్ సీన్ ఎలా లీకైంది. లోకేషన్ లో మిగితా వాళ్లు గమనించకుండా ఎందుకు ఉన్నారు.. అనేది సంచలనం సృష్టిస్తోంది.
ఈ లీక్ పై రాజమౌళి ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు లీకైన వీడియోలో మహేష్ లుక్ అదిరిపోయింది. అలాగే మహేష్ ఎదురుగా వీల్ చైర్ లో ఉన్న వ్యక్తి మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ అని ఫిక్స్ అయిపోయారు మూవీ ఫ్యాన్స్. ఏది ఏమైనా , షూటింగ్ లోకేషన్ నుంచి వీడియో లీక్ కావడంపై రాజమౌళికి ఈ రోజు రాత్రి అయితే నిద్ర ఉండదు. ఇండియాలో షూటింగ్ ముగిసిన తర్వాత, విదేశాల్లో కీలకమైన షెడ్యూల్స్ ప్రారంభానికి ముందు ఇండియాలో కీలకమైన ప్రెస్ మీట్ నిర్వహించాలనుకున్నాడట రాజమౌళి. ఈలోపే ఈ ఘోరం జరిగిపోయింది. మరి జక్కన్న రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కొద్ది గంటల్లోనే తెలుస్తుంది.