ప్రభాస్ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. అందులో సలార్ సీక్వెల్ కు ఉన్నంత క్రేజ్, మరే మూవీకి లేదు. థియేటర్స్ లో ఈ సినిమా వెయ్యి కోట్లు కొల్లగొట్టలేకపోయింది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో షారుఖ్ నటించిన డంకీ తో క్లాష్, లేదా కేజీయఫ్ తో కనెక్షన్.. ఇలా చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే థియేటర్స్ నుంచి వెళ్లిపోయిన తర్వాత సలార్ ఇటు యూట్యూబ్ లో వ్యూస్ రూపంలో, అటు ఓటీటీ ప్లాట్ ఫామ్ కంటిన్యూ గా ట్రెండ్ అవ్వడం బట్టి, సలార్ సీక్వెల్ రిలీజైన రోజున, బాక్సాఫీస్ ఊగిపోవడం ఖాయం అంటూ ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు.

గత ఏడాది ప్రభాస్ బర్త్ డే రోజున సలార్ సీక్వెల్ చిత్రీకరణ ప్రారంభించినట్లు ప్రశాంత్ నీల్ తెలిపాడు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. మధ్యలో సలార్ థియేటర్ లో నడిచిన విధానం తనకు షాక్ ఇచ్చింది అన్నాడు. సలార్ సీక్వెల్ మాత్రం తన కెరీర్ లో  బెస్ట్ ఫిల్మ్ కావాలి అనుకుంటున్నాడు అన్నాడు. అయితే సీక్వెల్ షూటింగ్ గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.

ఇప్పుడు సలార్ ఫ్రెండ్ అదే.. సలార్ సినిమాలో ప్రభాస్ కు ఫ్రెండ్ గా నటించిన పృథ్వీరాజ్.. సలార్ సీక్వెల్ షూటింగ్ ఎప్పుడూ అనేది క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నాడని,ఈ సినిమా పూర్తైన తర్వాత సలార్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్తుంది అంటున్నాడు. అంటే నెక్ట్స్ ఇయర్ సలాల్ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అయినా, 2027లో రిలీజ్ కావడం ఖాయం.

ఇవి కూడా చదవండి..

error: Content is protected !!