ఎన్టీఆర్ అభిమానులను గాల్లో తేలేలా చేస్తోన్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే, అది డ్రాగన్ మూవీ. ఈ టైటిల్ ఇంకా అఫీసియల్ గా  బయటికి రాకపోయినా, కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసే సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ చేసారు అనేది టాక్ ఉంది. సినిమా యూనిట్ కూడా చాలా సార్లు ఎన్టీఆర్ సినిమా అనగానే, ఇదే టైటిల్ చెప్పేవారు. ఇక అసలు సంగతికి వస్తే, ఈ మూవీని ఇదే నెలలో లాంఛ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అందుకే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డేట్స్ లాక్ చేసిన మిగితా స్టార్స్ లిస్ట్ బయటికి వస్తోంది. ఈ మూవీలో విలన్ గా , మలయాళ స్టార్ టొవినో థామస్ నటించబోతున్నాడట.

ఒకప్పుడు టొవినో అంటే ఎవరని అడిగినా వేరు కాని ఇప్పుడు టొవినో అంటే గుర్తు పట్టని పాన్ ఇండియా ప్రేక్షకులు లేరు. మిన్నల్ మురళిలో సూపర్ హీరోగా నటించాడు. 2018లో కూడా రియల్ లైఫ్ సూపర్ హీరో రోలే చేసాడు. ఆ విషయం ఈ సినిమా చూసిన వారికి తెలుస్తుంది. ఇక తుళుమల్లా లాంటి చిత్రాలు థామస్ కు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే టొవినో గురించి చాలా సేపు చెప్పుకోవాల్సి వస్తుంది. మీకు వీలుంటే పైన చెప్పిన సినిమాలు చూడండి. టొవినో ఎంత గొప్ప నటుడు అనేది తెలుస్తుంది.

ఇప్పుడు  ఈ స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ డ్రాగన్ లో నటించబోతున్నాడట. పైగా ఇతనే విలన్ అని బాగా ప్రచారం సాగుతోంది. 2026 సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికైతే ఈ సినిమాకు ఇవి మాత్రమే అప్ డేట్స్ మిగితావన్ని రూమర్స్ మాత్రమే..

ఇవి కూడా చవవండి

error: Content is protected !!