మణిరత్నం దగ్గర ఒక ప్రేమ కథ ఉంది. దాన్ని ఓ యంగ్ హీరోతో తెరకెక్కించాలి అనుకుంటున్నాడు. అందుకోసం మొదట జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి తో సంప్రదింపులు జరిపాడు. నటనలో మంచి ఈజ్ కనబరిచే నవీన్ తో లవ్ స్టోరీ తీస్తే, అతడిని తమిళ తెరకు పరిచయం చేయవచ్చు అనుకున్నాడు. అలాగే తెలుగులో మంచి వసూళ్లను అందుకోవచ్చు అంటూ ప్లాన్ వేసినట్లు సమాచారం. కాని ఎందుకో ఈ కాంబినేషన్ కుదరలేదు.

ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చాడు మణిరత్నం. ఇప్పుడు ఇదే లవ్ స్టోరీని, తన ఫేవరేట్ హీరోస్ లో ఒకడైన విక్రమ్ తనయుడు ధృవ్ తో, ప్లాన్ చేస్తున్నాడట. మణిరత్నం డైరెక్ట్ చేసిన రావణన్, పొన్నియిన్ సెల్వన్ సిరీస్ లో నటించాడు విక్రమ్. ఆ అనుబంధం తోనే ఇప్పుడు విక్రమ్ సన్ తో మూవీ చేయాలనుకుంటున్నాడట. తగ్ లైఫ్ తర్వాత కోలీవుడ్ బాక్సాఫీస్ కు ఇమిడియెట్ గా కమ్ బ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నాడు మణిరత్నం. అందుకోసం జస్ట్ 60 రోజుల్లో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేయాలనుకుంటున్నాడట. మణిరత్నం, జూనియర్ విక్రమ్ కాంబో , ప్రస్తుతం కోలీవుడ్ ను షేక్ చేస్తోంది.

 అర్జున్ రెడ్డి మూవీని కోలీవుడ్ లో రెండు సార్లు రీమేక్ చేసి, తమిళ సినీ పరిశ్రమకు డెబ్యూట్ ఇచ్చాడు ధృవ్ కాని, హిట్ కొట్టలేకపోయాడు . ఇక సెకండ్ ఫిల్మ్ విక్రమ్ తో కలసి మహాన్ లో నటించాడు. తనదైన నటనతో బాగానే ఇంప్రెస్ చేసాడు. కాని రెండవసారి కూడా హిట్ చూడలేకపోయాడు. ప్రస్తుతం మానన్నన్, కర్ణన్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మారి సెల్వరాజ్ మేకింగ్ లో బైసన్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో ప్రేమికుడిగా నటించేందుకు సిద్దమవుతున్నాడు. విక్రమ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తే, క్రేజీ ప్రాజెక్ట్ గా మారడం ఖాయం. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించబోతోందట. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందట

ఇవి కూడా చదవండి

error: Content is protected !!