ఇండియాలో టాప్ సెల్లింగ్ కార్స్ కంపెనీ మారుతీ సుజుకీ ( MarutiSuzuki) తమ వాహనాల ధరలను పెంచనుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇటీవలే వెల్లడించింది. 2025 ఫిబ్రవరి 1 నుంచి ,అందుబాటులో ఉన్న మోడల్స్ అన్నిటిపై పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది మారుతీ సుజుకీ.ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడంతో వాహనాల ధరను పెంచక తప్పడం లేదని కంపెనీ పేర్కొంది. మోడన్ ను బట్టి పెంపు ఉంటుంది. సెలెరియో పై అత్యఅధికంగా 32,500 పెంచింది మారుతీ సుజుకీ. ఇన్విక్టో ప్రీమియం మోడల్ పై 30 వేలు , వ్యాగనార్ పై 15 వేలు, స్విఫ్ట్ పై 5 వేలు, బ్రెజ్జా పై 20 వేలు, విటారా పై 25 వేలు, ఆల్టో కే10 పై 20 వేలు, ఎస్ ప్రెసో పై 5 వేలు పెంచింది కంపెనీ.  ఇక ప్రీమియం వర్షన్ వైపు చూస్తే కాంపాక్ట్ మోడల్ బాలెనో పై 9 వేలు పెరగనుంది. అలాగే మరో కాంపాక్ట్ ఎస్ యూవీ ఫ్రాంక్స్ పై 5,500 పెరగనుంది. డిజైర్ పై పది వేలు పెరగనుంది.

error: Content is protected !!