సుజుకీ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. సుజుకీ జిమ్నీకి కనీవినీ ఎరుగని రీతిలో బుకింగ్ జరుగుతుండటంతో, తాత్కాలికంగా బుకింగ్స్ ను నిలిపేసింది. ఏంటి ఇదంతా ఇండియాలోనే, అది జిమ్నీకా.. ఇంపాజిబుల్ అనుకోకండి… ఇండియాలో థార్ దెబ్బకు, సేల్స్ లో వెనుక పడిన జిమ్నీ, జపాన్ లో మాత్రం దుమ్మురేపుతోంది. జనవరి 30 నుంచి అక్కడ బుకింగ్ ప్రారంభించింది.బుకింగ్ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 50 వేల బుకింగ్ సొంతం చేసుకుంది.

ఈ స్థాయిలో రెస్పాన్స్ ఊహించని సుజుకీ డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో, వెయిటింగ్ పెరుగుతుండటంతో ప్రస్తుతానికి బుకింగ్స్ ను నిలిపివేసింది. ఇప్పటి వరకు బుకింగ్ చేసుకున్న వారికి ఏప్రిల్ 30 నుంచి డెలివరి ప్రారంభిస్తామని చెప్పింది కంపెనీ.

అయితే జపాన్ లో తిరిగి బుకింగ్ ఎప్పుడు ప్రారంభించేది వెల్లడించలేదు. జపాన్ లో సుజుకీ జిమ్నీ స్పీడ్ మాన్యువల్ వేరియంట్ స్టార్టింగ్ ప్రైస్ 14.88 లక్షలు. ఏటీ వెర్షన్ ప్రైస్ 15.43 లక్షలు. భారత్ లో మాత్రం వీటి ధర రూ. 12.74 లక్షలు, 14.79 లక్షలు.

ఇండియాలో థార్ రాక్స్, ఫోర్స్ గుర్ఖా లాంటి 5 డోర్ ఎస్  యూవీలకు జిమ్నీ బలంగా పోటీ ఇస్తోంది. 5 డోర్లతో వస్తోన్న ఈ కారును హర్యానాలోని మారుతి సుజుకి ప్లాంట్ లో తయారు చేస్తున్నారు. దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ముందు మెక్సికో, ఆ తర్వాత ఆస్ట్రేలియా , దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో జిమ్నీ సూపర్ హిట్టైంది.

ఇవి కూడా చవవండి
error: Content is protected !!