తండేల్ ప్రమోషన్స్ లో చాలా వరకు రామ్ చరణ్ పై, నిర్మాత అల్లు అరవింద్ ఇన్ డైరెక్ట్ గా స్పందించిన సంగతి తెలిందే. చరణ్ కు మేనమామ ఏమన్నాడో, కింది లింక్ చదివితే మీకు అర్ధమవుతుంది.

ప్రైడ్ తెలుగు న్యూస్ – సినిమా – అల్లు అరవింద్ క్షమాపణలు – వాడు నాకు బిడ్డలాంటివాడు

అయిదేదో అయింది. నేను ఏది కావాలని అనలేదు. దిల్ రాజు ఉన్న పోజీషన్ ను బట్టి, అప్పుడు అలా మాట తూలాను. ఆ తర్వాత కూడా ఇంటర్వ్యూలో అలా ఎందుకు అన్నారు అంటే నో కామెంట్ అనేసాను. అందుకు కారణం పబ్లిక్ గా సారీ చెప్పాలనే అన్నారు అల్లు అరవింద్. గేమ్ ఛేంజర్ ను తక్కువగా, రామ్ చరణ్ చిత్రాన్ని తక్కువగా చేసి చూపించడం పై, మెగాభిమానులు బాధపడినట్లు తెలింది. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నాపై ట్రోలింగ్ జరిగింది. అందుకే వారి నుంచి క్షమాపణలు కోరుతున్నారు.

వాడు నాకు బిడ్డలాంటి వాడు అన్నారు అల్లు అరవింద్.

తనకున్న ఏకైక మేనల్లుడు, అతడిని తాను ఏకైక మేనమామ,

తమ ఇద్దరిని వదిలేయమని కోరారు.

చరణ్ తో తనకు మంచి అనుబంధం ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

అది కేవలం పొరపాటున మాత్రమే మాట్లాడాను అన్నారు అల్లు అరవింద్.

అసలు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అన్నారు.

మరి మరో ఇంటర్యూలో, రామ్ చరణ్ తొలి చిత్రం చిరుత యావరేజ్ అన్నారని, మగధీర కోసం తానే స్వయంగా, రాజమౌళి దగ్గరికి వెళ్లినట్లు చెప్పారని అడగ్గా.. ఇక వదిలేయండి.. ఏవో అన్నాను. ఇలా వివరణ ఇస్తూ వెళితే, వివాదం కొనసాగుతుంది. మళ్లీ కొత్త అర్ధాలు పుట్టుకొస్తాయి అన్నారు అల్లు అరవింద్.

ఒక్క రోజులో అల్లు అరవింద్ ఇలా సాఫ్ట్ గా మారిపోవడానికి కారణం ఏంటి అనేది ఎవరికి అర్ధం కాకుండా ఉంది. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు పుష్ప -2 విజయం పై మాట్లాడిన వెంటనే అల్లు అరవింద్ ఇలా రెస్పాన్డ్ అయ్యారా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో, మెగాభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప-2 పెద్ద బ్లాక్ బస్టర్, దానికి నేను గర్విస్తాను అంటూ ఎంతో ఉప్పోంగిపోయారు మెగాస్టార్.. అల్లు కుటుంబంపై మెగా కుటుంబం కడుపులో ఇంత ప్రేమ పెట్టుకుంటే, అల్లు ఫ్యామిలీ మాత్రం ఎందుకో కత్తులు దూస్తోంది. చరణ్ కూడా అన్ స్టాపబుల్ షోకు వెళ్లినప్పుడు, తన మామయ్యాతో చాలా క్లోజ్ గా ఉంటానని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి:
error: Content is protected !!