
హిట్టైన సినిమాలో నటించే ఛాన్స్ మిస్ అవ్వడం అంటే అది వేరు. బాధ గురించి చెప్పడానికి మాటలు రావు. కాని అల్రెడీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న మూవీలో ఛాన్స్ మిస్ అయిందని, ఓ హీరో ఫీలవుతున్నాడు. ఆయన ఎవరో కాదు. విజయ్ ఆంటోని. అదేటిం ఘాటీకి , బిచ్చగాడికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా.. నిజానికి క్రిష్ ఈ చిత్రంలో హీరోగా విజయ్ ఆంటోనిని అనుకున్నాడట. అనుష్క, విజయ్ కాంబినేషన్ లో మూవీ ప్లాన్ చేసాడట. ఘాటీ కథంతా చెప్పాడంటా కాని, సినిమాలో హీరోయిన్ అనుష్క అని చెప్పలేదట. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మిస్ అయినందుకు తెగ ఫీలువుతున్నాడు విజయ్ ఆంటోని.
అనుష్క హీరోయిన్ అని తెల్సి ఉంటే, అసలు స్టోరీ వినకుండా డేట్స్ ఇచ్చేవాడిని అంటున్నాడు. ఇంతకీ విజయ్ స్థానంలో ఎవరు నటించారో మీకు తెల్సుగా, ప్రఖ్యాత శివాజీ గణేశన్ గారి మనవడు విక్రమ్ ప్రభు. అయిన ఘాటీ ఏదైనా సంచలన విజయం సాధిస్తే, అనుకోవచ్చు, ఫ్లాపైన మూవీలో ఛాన్స్ మిస్ అయినందుకు విజయ్ ఇంతలా ఫీలవుతున్నాడు అంటే , జేజమ్మకు ఆంటోని ఏ రేంజ్ ఫ్యాన్ అనేది అర్ధం అవుతోంది కదా.. అంతే కాదు.. ఫ్యూచర్ లో స్వీటీ అనే పేరు చెబితే చాలు, డేట్స్ ఇచ్చేస్తానంటూ అఫీసియల్ గా ఎనౌన్స్ చేసాడు. మొత్తానికి దేవసేనకు భలే ఫ్యాన్ దొరికాడు.
ఇవి కూడా చదవండి
