ఇండియాలో ఎంతో మంది స్టార్స్ ఉండవచ్చు, మరెంతో మంది సూపర్ స్టార్స్ ఉండవచ్చు. కాని మోహన్ లాల్ లాంటి స్టార్ ను, సూపర్ స్టార్ , కంప్లీట్ యాక్టర్ ను చూసి ఉండం. అదెలా అంటారా.. ఈ మలయాళ సూపర్ స్టార్, ప్రస్తుతం లూసిఫర్ -2 ను రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

మార్చి 27న లూసిఫర్ సీక్వెల్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. అందుకు తగ్గట్లే మూవీని యూనిట్ ప్రమోట్ చేస్తూ వస్తోంది. ఈ ప్రమోషన్స్ లోనే లూసిఫర్ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చాడు. అదేంటి అంటే, ఈ మూవీలో నటించినందుకు గానూ, మోహన్ లాల్ రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ఆ బడ్జెట్ ను కూడా సినిమాను నిర్మించేందుకే ఉపయోగించారట.

ఈ రోజుల్లో రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా నటించే హీరోలు ఉన్నారా.. అందుకే లాల్ చాలా ప్రత్యేకంగా మారాడు.ఇండియన్ సినిమాలో ఒకే ఒక్కడు అనిపించుకున్నాడు. ఇదంతా కూడా మలయాళ సినిమా స్థాయిని పెంచేందుకే అని మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునే అవసరమే లేదు. మరో విశేషం అంటే లూసిఫర్ -2 తర్వాత లూసిఫర్ -3 కూడా రానుంది. ఆ మూవీకి కూడా లాల్ రూపాయి రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశం లేదు.

error: Content is protected !!