
నరసింహ సీక్వెల్ ఖరారు కావడం తెల్సిందే, అయితే ఈ సీక్వెల్ కు, రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో మిగిలిపోయిన కల నెరవేరడం, అదెలా అంటే, అదో పెద్ద స్టోరీ. అందుకు 25 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. ఎందుకంటే 1999లో తమిళంలో పడయప్ప, తెలుగులో నరసింహ పేరుతో రిలీజైంది రజనీకాంత్ చిత్రం. సినిమా చూసినవారందరూ రజనీకాంత్ నటనతో పాటు రమ్యకృష్ణ నటనపై ప్రశంసలు కురిపించారు. మాములుగా అయితే రజనీకాంత్ చిత్రం అంటే, సూపర్ స్టార్ డామినేషన్ ఉంటుంది.
కాని ఈ చిత్రం విషయంలో టాక్ రివర్స్ అయింది. రమ్యకృష్ణ తన నటనతో సూపర్ స్టార్ రజనీకాంత్ ను డామినేట్ చేసింది అనే టాక్ మొదలై, మెళ్లిగా మహిళా ప్రేక్షకులు నరసింహ సినిమాకు నిరాజనం పట్టడం వరకు వెళ్లింది. దీంతో ఒక దశలో రజనీకాంత్ ఈ చిత్రానికి ముందుగా అనుకున్న నీలాంబరి టైటిల్ పెట్టాల్సింది అనుకున్నారు.. నిజానికి నరసింహ కథ రెడీ అయినప్పుడు, ఈ సినిమాకు నీలాంబరి టైటిల్ కరెక్ట్ అనుకున్నారట. కాని అప్పుడు రజనీకాంత్‌కు ఉన్న తిరుగులేని స్టార్ డమ్ తో,
హీరోయిన్ పేరుతో టైటిల్ పెడితే, ఆడియెన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అని భయపడి, మూవీకి పడయప్ప అనే టైటిల్ ఖరారు చేసారు. అయితే రిలీజ్ తర్వాత, చాలా సార్లు రజనీకాంత్ ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పారు.. ఇప్పుడు సీక్వెల్ కు సమయం ఆసన్నమైంది. మూవీకి పడయప్ప -2 అని టైటిల్ పెట్టకుండా, డైరెక్ట్ గా నీలాంబరి అని ఖరారు చేసాడు సూపర్ స్టార్. ఆ విధంగా తన 25 ఏళ్ల కలను నెరవేర్చుకున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం ఈ సినిమాను కథను మొదటి భాగం తెరకెక్కించిన కె. ఎస్. రవికుమార్ సీక్వెల్ స్టోరీపై కసరత్తు చేస్తున్నాడు. వచ్చే ఏడాది సీక్వెల్ పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
