
కొద్ది గంటల క్రితమే అమెజాన్ ఎమ్ ఎక్స్ ప్లేయర్ పేరుతో, రికార్డ్ స్థాయిలో కొత్త సిరీస్ లు ప్రకటించింది. ఇంతలోనే నెట్ ఫ్లిక్స్ నిద్ర లేచింది. కొద్ది నిముషాల క్రితం వరకు, వరుస పెట్టి ఈ ఏడాది రిలీజ్ కానున్న వెబ్ సిరీస్ లిస్ట్ రిలీజ్ చేస్తూనే ఉంది. చేస్తూనే ఉంది. చేస్తూనే ఉంది. ఒకటా రెండా కుప్పలు తెప్పలుగా కొత్త సిరీస్, మూవీస్ లిస్ట్ రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. వీటిల్లో తెలుగు వారికి పనికొచ్చేది మాత్రం రానా నాయుడు సీక్వెల్. మొదటి భాగం కంటే భారీ బడ్జెట్ తెరకెక్కించినట్లు టీజర్ ను బట్టి చూస్తే అర్ధమవుతోంది.
ఇక కీర్తి సురేష్ కూడా అక్క పేరుతో ఒక వెబ్ సిరీస్ లో నటించింది. ఇది మహానటి నటించిన తొలి వెబ్ సిరీస్ అని చెప్పాలి. సందీప్ కిషన్ సూపర్ సుబ్బుగా మారాడు. ఇక నెట్ ఫ్లిక్స్ లో సూపర్ హిట్టైన కొహ్రాకు సెకండ్ సీజన్ ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. దిల్లీ క్రైమ్ కు మూడో సీజన్ రాబోతోంది. ఇవి కాకుండా గ్లోరి, మండలా మర్డ్ర్స్, ది రాయల్స్ లిస్ట్ లో ఉన్నాయి. షారుఖ్ సన్ ఆర్యన్ ఖాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ కూడా ఈ ఏడాదే నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో మూడో సీజన్ కూడా రానుంది. ఇప్పటి వరకు మీరు చూసింది సిరీస్ కు సంబంధించిన లిస్ట్.
ఇక మూవీస్ బాక్స్ ఓపెన్ చేస్తే,
మాధవన్, సిద్దార్థ్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన టెస్ట్ స్ట్రీమింగ్ కు రెడీగా ఉంది. మరో వైపు సైఫ్ నటించిన జెవెల్ థీఫ్, రాజ్ కుమార్ రావు న్యూ మూవీ టోస్టర్, మాధవన్ సోలో ఫిల్మ్ ఆప్ జైసా కోయి , ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోన్న మరి కొన్ని నెట్ ఫ్లిక్స్ మూవీస్.