ఇక్కడ డ్రాగన్ అంటే ఎన్టీఆర్ అన్నట్లు, ఇక ఎటాక్ అంటే షూటింగ్ కు రెడీ అవుతున్నాడని అర్ధం అన్నట్లు.. కేవలం ఇంట్రో ఇంట్రెస్టింగ్ గా ఉండాలని ఇలా రాసుకొచ్చాం. అసలు సంగతి ఏంటంటే ప్రశాంత్ నీల్ మేకింగ్ లో జూనియర్ నటించే కొత్త చిత్రం, ఫిబ్రవరిలోనే సెట్స్ పైకి వెళ్లనుందట.

మరో విషయం ఏంటంటే, వచ్చే నెలలోనే మరో పోస్టర్ ను రిలీజ్ చేస్తారట. మొత్తానికి ఫిబ్రవరి ఇప్పుడు టైగర్ ఫ్యాన్స్ కు ఫెస్టవల్ మంత్ గా మారనుంది. ప్రస్తుతానికి ఫిబ్రవరి చివరి వారంలో షూట్ స్టార్ట్ అనుకుంటున్నారు. లేదా మార్చి మొదటి వారంలో షూటింగ్ స్టార్ట్ కావచ్చు. అంతకంటే ఆలస్యం మాత్రం కాదు.ఎందుకంటే వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో, డ్రాగన్ ను దింపాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడట. అదే విషయాన్ని సినిమా షూటింగ్ ప్రారంభించిన రోజే చెప్పేస్తాడట. ఇక ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు అని, 1500 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లే టార్గెట్, ప్రశాంత్ నీల్ వర్క్ చేయబోతన్నాడని సమాచారం. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ తో పాటు, సినిమా రిలీజ్ డేట్ తో పాటు, మూవీ టైటిల్ డ్రాగన్ అనేది కూడా క్లారిటీ ఇచ్చేస్తాడట ప్రశాంత్ నీల్. కేజీయఫ్ సిరీస్ తీసి, సలార్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకుని, ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు అంటే, ఈ సినిమాపై పాన్ ఇండియా వైడ్ గా ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పైగా ప్రశాంత్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. తన అభిమాన నటుడి కోసం ఎలాంటి కథను సిద్ధం చేసాడో తెల్సుకోవాలంటే వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరో వైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా ఆరగెంట్ గా ఉంటుందనే టాక్ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి..ప్లీజ్
error: Content is protected !!