కన్నప్ప మొదటి మూడు రోజుల వసూళ్లు 30 కోట్లు దాటినట్లు సమాచారం. ఇవి మంచు విష్ణు కెరీర్ లోనే అత్యఅధిక వసూళ్లు. అయితే సినిమా బడ్టెట్ 200 కోట్లు అని చెప్పాడు మంచు విష్ణు. ఇవి లెక్కలోకి తీసుకుంటే, కన్నప్పకు ఇంకా ఇంకా కలెక్షన్స్ కావాలి. మరో వైపు బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు అయితే వస్తున్నాయి కాని, అవి బడ్జెట్ ను అందుకుంటాయా లేదా అన్నది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.

ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. హిందీలోనూ ఈ సినిమాకు రోజు రోజుకు వసూళ్లు పెరుగుతున్నాయి. సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించడంతో, కన్నప్ప హిందీ వర్ష్ కు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. నెక్ట్స్ వీకెండ్ కు ఈ సినిమా వసూళ్లపై ఒక క్లారిటీ వస్తుంది.

ఇక కన్నప్పకి పీక్వెల్ తీసే ఆలోచన చేస్తున్నట్లు మంచు విష్ణు ఈ సినిమా సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. అందుకోసం ఒక స్టార్ డైరెక్టర్ రంగంలోకి దిగబోతున్నాడని కూడా చెప్పాడు. కన్నప్పలో కన్నప్ప కథను మొత్తం చెప్పేశారు. అంతుకు ముందు కథ అంటే కన్నప్ప పూరీకుల కథ అయినా చెప్పాలి, లేదా కన్నప్ప ముందు ముందు జన్మ గురించి అంటే అర్జునుడు గురించి అయినా చెప్పాలి. మరి మంచు విష్ణు ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.

ఇది కూడా చదవండి

error: Content is protected !!