
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు .. గేమ్ ఛేంజర్ అవుతాయని అందరూ భావించారు.భారత మార్కెట్ లో మొదట సంచలనం సృష్టంచినట్లు కనిపించినా, ఆ తర్వాత మాత్రం కష్టమర్స్ కంప్లైంట్స్ తో ఈ కంపెనీ ఉక్కిరిబిక్కిరైంది. ప్రస్తుతం మూడో జనరేషన్ ప్లాట్ ఫామ్ పై రూపొందిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను లాంఛ్ చేసేందుకు కంపెనీ సిద్దమవుతోంది. అందుకు జనవరి 31 ఉదయం 10.30నిలకు ముహూర్తంగా ఖారారు చేసింది.
సెకండ్ జనరేషన్ స్కూటర్స్ విషయంలో వచ్చిన కంప్లైంట్స్ ను దృష్టిలో పెట్టుకుని, థర్డ్ జనరేషన్ స్కూటర్లను కంపెనీ డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ స్కూటర్లు డిజైన్, ఫీచర్లు, పాటు మెరుగైన పని తీరు కనబరుస్తుందని కంపెనీ సీఈఓ భవీశ్ అగర్వాల్ చెప్పుకొస్తన్నాడు. ఈసారి మార్కెట్ లోకి వచ్చే ఓలా స్కూటర్లు టోటల్ ఇండస్ట్రీని సర్ ప్రైజ్ చేస్తాయి ఊరిస్తున్నాడు. ఓలా స్కూటర్ల క్వాలిటీ, సర్వీస్ విషయంలో వస్తోన్న కంప్లైంట్స్ ను థర్డ్ జనరేషన్ స్కూటర్స్ తో చెక్ పెడుతాయని కంపెనీ చాలా ఆశలే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పటి వరకు విడి భాగాల కోసం థర్డ్ పార్టీపై ఆధారపడుతూ వచ్చింది కంపెనీ. కాని ఈసారి మాత్రం వాటిని సొంతంగా రూపొందించింది. నిజానికి గత ఆగస్ట్ లోనే వీటీని మార్కెట్ లోకి తీసుకురావాలని కంపెనీ ప్రయత్నించినప్పటికీ .. ఆ తర్వాత ఎందుకో నిర్ణయం మార్చుకుంది.
ఇవి కూడా చదవండి..