
తమిళనాట ఇప్పుడు ఒక వ్యక్తి ఫోటో బాగా వైరల్ అవుతోంది.
అయన పేరు సవి సింధు. అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ ఆరంభంలో ముఖ్య పాత్ర పోషించాడు. సినిమా చూసిన వారందరికి తన నటన బాగా నచ్చింది. అయితే ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. అంతకు ముందు లా చదివాడు. కాని సినిమాలు అంటే పిచ్చితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సొంతూరు లక్నో , కాని తమిళ చిత్రంలో మెరిసాడు. బాలీవుడ్ చిత్రాల్లోనూ కొన్ని పాత్ర చేసాడు. ఇప్పుడు వాచ్ మెన్ గా చేస్తున్నాడు. రోజుకు 12 గంటలు డ్యూటీ చేస్తున్నాడు. కుటుంబ పోషనే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందట. ఇక సినిమాలు చూడటం అనేది తనకు కలగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి పరిశ్రమను ఏలుతున్న చిరంజీవి, రజనీకాంత్, నాని, విజయ్ దేవరకొండ, రవితేజ, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అజిత్ లాంటి హీరోలు ఒక వైపు, ఇలా సినిమా పరిశ్రమను నమ్ముకుని , జీవితాంతం అవకాశాల కోసం ఎదురు చూసి కుప్పకూలిపోయే నటీ నటులు ఉన్నారు. సవిని ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో నెజిటెన్స్ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆరంభం హీరో అజిత్ కొంత మొత్తంలో సాయపడితే, ఇతని జీవితం బాగుపడుతుందని పోస్టులు పెడుతున్నారు. అజిత్ వరకు ఈ విషయం వెళితే పట్టించుకోకుండా ఉండడు. ప్రస్తుతం కార్ రేసింగ్ పై ఫోకస్ పెట్టిన అజిత్, ఆ తర్వాత, గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ తోనే మరో చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇది కూడా చదవండి