
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరో గొప్ప గౌరవం దక్కింది. ప్రస్తుతం బ్రెజిల్ పర్యటనలో ఉన్నారు మోదీ. అక్కడి అత్యున్నత పౌర పురస్కారాన్ని మోదీ అందుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూడా .. గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేసారు. అంతకు ముందు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులపై మాట్లాడారు. క్రిటికల్ మినరల్స్ ను ఏ దేశమూ సొంత ప్రయోజనాల కోసం వాడుకోకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
జులై 2న ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన చేపట్టిన సంగతి తెల్సిందే. జులై 9న వరకు ఈ విదేశీ పర్యటన కొనసాగనుంది.ఘనా, ట్రినిడాడ్, అర్జెంటినా, బ్రెజిల్ పర్యటనలు పూర్తి అయ్యాయి. ఘనా పర్యటనలో అక్కడి అత్యున్నత పురస్కారం ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా సత్కారాన్ని అందుకున్నారు మోదీ. ప్రస్తుతం నమీబియాకు వెళ్లనున్నారు మోదీ. గడిచిన మూడు దశాబ్ధాల్లో ఈ దేశం పర్యటించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డుల్లోకి ఎక్కనున్నారు.
ఇది కూడా చదవండి
