కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు, సినిమా ఉన్నంత కాలం అలా నిలిచిపోయాయి. సరిగ్గా అలాంటి చిత్రాల జాబితాలో కనిపిస్తాయి హ్యారీ పోటర్, అలాగే భారతీయ చిత్రం దిల్ వాలే దుల్హనియా లేజాయింగే. ఒకటి హాలీవుడ్ మూవీ, మరొకటి బాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్. ఈ రెండు చిత్రాలకు పోలీక ఏంటి అంటే అందుకు లండన్ లోని లీసెస్టర్ స్క్వేర్ వరకు వెళ్లి రావాల్సిందే.. ఎందుకంటే అక్కడే హ్యారీ పోటర్ తో పాటు మేరీ పాపిన్స్ మూవీస్ సిగ్నేచర్ పోజుతో ఉన్న కాంస్య విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన మన భారతీయ చిత్రం దిల్ వాలే దుల్హనియే లేజాయింగే మూవీ నుంచి మోస్ట్ ఐకానిక్ స్టిల్ ను కాంస్య విగ్రహంగా మలిచి నెలకొల్పారు.  ఇప్పుడే ఇదంతే ఎందుకు అంటే, షారుఖ్ ,కాజోల్ జంటగా నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయింగే సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లండన్ లో లీసెస్టర్ స్క్వేర్ లో ఏర్పాటైన కాంస్య విగ్రహాన్ని హీరో షారుక్, హీరోయిన్ కాజోల్ ఆవిష్కరించారు. అందుకు సంబంధించిన నవ్వులు ఈ ఫోటోలో చూడవచ్చు. ఈ గౌరవం దక్కించుకున్ని తొలి భారతీయ చిత్రం ఇదే. దిల్ వాలే దుల్హనియా చిత్రం తనకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చిందని షారుక్ చెప్పుకొస్తే, 30 ఏళ్లు దాటినా ఈ సినిమాకు క్రేజ్ తగ్గలేదని కాజోల్ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!