
ప్రైడ్ తెలుగు, పెద్ది సినిమా ఫస్ట్ సాంగ్ చికిరి పై స్టోరీ . ఆచార్య, గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్స్ తర్వాత, చాలా వెనుక పడిపోయాడు రామ్ చరమ్. కాని పెద్దితో ఆ రికార్డులన్నిటిని సెట్ చేసే పనిలో పడ్డాడు. కొద్ది గంటల క్రితం రిలీజైన పెద్ది ఫస్ట్ సాంగ్ చికిరి, యూట్యూబ్‌లో రికార్డుల వేట కొనసాగిస్తోంది. పాట విడుదలై 24 గంటలు గడవక ముందే, చాలా రికార్డులను బద్దలు కొట్టేసింది. అందులో పుష్ప-2 రికార్డ్ కూడా ఉంది. పైగా పుష్ప-2 సాంగ్ నెంబర్ వన్ పోజీషన్ లో ఉంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, శ్రీలీల కలసి స్టెప్పులేసిన కిస్సిక్ సాంగ్, ఇప్పటి వరకు హైయ్యెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న సాంగ్.
అంటే పాట రిలీజైన తొలి 24 గంటల్లో కిస్సిక్ సాంగ్ నెలకొల్పిన రికార్డ్ ఇది. పుష్ప -2 సాంగ్ తొలి 24 గంటల్లో 27.19 మిలియన్ వ్యూస్ రాబడితే, ఇప్పుడు పాట విడుదలై 24 గంటలు గడవకముందే, చికిరి సాంగ్ కిస్సిక్ వ్యూస్‌ను దాటేసింది. 28 మిలియన్ వ్యూస్ దాటిపోయాయి వ్యూస్. అంటే రామ్ చరమ్ రికార్డుల వేట మొదలైనట్లే గా.. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న పెద్ది వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్, ఇఫ్పుడు సాంగ్ సూపర్ హిట్ కావడంతో, పెద్దిపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగిపోయాయి.
ఇది కూడా చదవండి
