Pushpa2Reloaded Version on Netflix
Pushpa2Reloaded Version on Netflix

అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప -2 ఓటీటీ రిలీజ్ కు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప -2, 50 రోజులకు పైగా థియేటర్స్ లో కొల్లగొట్టిన వసూళ్ల గురించి, 50 రోజులుగా చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు రికార్డులకు బ్రేక్ పడింది. పుష్ప రాజ్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు. అందుకు సంబంధించిన అఫీసియల్ పోస్టర్ ను నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అనేది ఇంకా రివీల్ కాకపోయినా, జనవరి 30 నుంచే స్ట్రీమింగ్ స్టార్ట్ కావచ్చు అనేది ప్రచారం సాగుతోంది. అయితే ఆ రోజున కూడా హిందీ వర్షన్ తప్పితే మిగితా లాంగ్వేజెస్ మాత్రమే,
అందుబాటులో ఉండనున్నాయి. హిందీ వర్షన్ ఓటీటీలోకి రావాలి అంటే మరో నెల రోజులు ఆగాల్సిందే. అది హిందీ ఇండస్ట్రీ పెట్టిన కండీషన్. బాక్సాఫీస్ దగ్గర పుష్ప సీక్వెల్ 1800 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. మరి ఓటీటీలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. అందులోనూ ఓటీటీ వర్షన్ రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన రీలోడెడ్ వర్షన్ కావడంతో, వ్యూస్ విషయంలో ఈ చిత్రం ఓటీటీలో పలు రికార్డ్స్ నెలకొల్పే అవకాశం మాత్రం ఉంది.

error: Content is protected !!