వాయిదాల మీద వాయిదాలు, ప్రభాస్ నటించే ప్రతి సినిమాకు రిలీజ్ డేట్ గండం అనేది ఒకటి ఉంటుంది. ఆ గండం ఇప్పుడు రాజాసాబ్ వెంటాడుతోంది. ఈ సినిమా ఇప్పటికే పలు సార్లు విడుదల తేదీ మార్చుకుంది. డిసెంబర్ 5న వస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ డేట్ కూడా మారిందని, కొద్ది గంటల్లో న్యూ డేట్ తో ఎనౌన్స్ మెంట్ రానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 5 అంటే పుష్ప-2 రిలీజ్ డేట్.

సెంటిమెంట్ పరంగా రాజాసాబ్ కు అద్భుతంగా ఉంటుందని రెబల్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిన వేళ, ఇప్పుడు పోస్ట్ పోన్ రూమర్స్ కలవరానికి గురి చేస్తున్నాయి. అయితే సంక్రాంతికి రాజాసాబ్ పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాడట. అదే నిజమైతే మాత్రం రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటించే చిత్రం, అలాగే నవీన్ పోలిశెట్టి నటిస్తోన్న అనగనగా ఒక రాజు, మాస్ రాజా నటిస్తోన్న అనార్కలి మూవీతో రాజాసాబ్ పోటీ పడాల్సి ఉంటుంది. దీంతో సంక్రాంతికి రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న చాలా చిత్రాల విడుదల తేదీలు మారే అవకాశంలేకపోలేదు. రాజాసాబ్ మూవీని మారుతి డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి

error: Content is protected !!