
ప్రైడ్ తెలుగు ఎక్స్ క్లూజివ్ స్టోరీ.. రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే దర్శకుడు ఎవరూ అనే విషయంలోనే వీరిద్దరికి అండర్ స్టాండింగ్ కుదరడం లేదని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మల్టీస్టారర్ కోసం రజనీకాంత్ ఒక దర్శకుడి పేరు చెబుతుంటే కమల్ మరో దర్శకుడి పేరు సూచిస్తున్నాడట.
తనతో విక్రమ్ మూవీని తెరకెక్కించి తిరుగులేని కమ్ బ్యాక్‌కు కారణం అయిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనే మల్టీస్టారర్ తెరకెక్కాలి అనేది కమల్ ప్లాన్. పైగా రజనీకాంత్ తో కూలీ కూడా బాగానే తీసాడు. కాని రజనీకాంత్ కు మాత్రం లోకేష్ కనగరాజ్ పై నమ్మకం కుదరడం లేదని సమచారం. అందుకే తాను మొదట జైలర్ డైరెక్టర్ నెల్సన్ పేరు చెప్పాడు. కాని నెల్సన్ కంటే లోకేష్ బెటర్ అనేది ఇప్పటికీ కమల్ చెబుతున్న మాట అట.
అటు లోకేష్ వద్దు, నెల్సన్ కూడా వద్దు. కోలీవుడ్ మరో స్టార్ డైరెక్టర్ అట్లీకి అవకాశం ఇవ్వాలి అనేది రజనీకాంత్ లేటెస్ట్ ఆప్షన్ అట. అట్లీతో మూవీ అంటే భారీ బడ్జెట్స్ కావాలి. అందుకే హీరోలు, నిర్మాతలు అట్లీతో సినిమా అంటే అమ్మో అనేస్తున్నారు. భారీ బడ్జెట్ పెట్టదలచుకుంటే మాత్రం, అట్లీనే బెస్ట్ అంటున్నాడట రజనీకాంత్. అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 2027లో ఈ చిత్రం విడుదల అవుతుంది. కమల్ ఒప్పుకుంటే మల్టీస్టారర్ కూడా అప్పుడే సెట్స్ పైకి వెళ్తుంది. రజనీకాంత్, కమల్ హాసన్ సుమారు 40 ఏళ్ల తర్వాత కలసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయాలనుకుంటున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు ఇంత క్రేజ్.
ఇవి కూడా చదవండి
