రంగస్థలం కాంబినేషన్ రిపీట్ అయితే చూడాలి అనేది మెగా ఫ్యాన్స్, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే పుష్ప తర్వాత, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సి ఉండగా, పుష్ప-2తో అది ఆలస్యం అయింది. ఇప్పుడు పుష్ప -2 తర్వాత తిరిగి రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు సుకుమార్. ఇది ఆల్రెడీ తెల్సిన విషయమే అయితే, పెద్ది ఆల్రెడీ 30-40 శాతం షూటింగ్ పూర్తి చేసుకోవడం, పైగా సుకుమార్ ఇంకా స్టోరీని లాక్ చేయకపోవడంతో, రామ్ చరణ్ ఈలోపు మరో చిత్రం చేస్తాడని అందుకోసం పలువురు దర్శకులను కలుస్తున్నాడని బాగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, RC17 గా తన దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తాడని సుకుమార్ కమ్ ఫామ్ చేసాడు.

మిలికిపురం, మట్టపర్రు సుకుమార్ సొంతూరు. ప్రతి సంక్రాంతికి ఇక్కడికి విచ్చేస్తాడు సుకుమార్. అయితే గత కొన్నేళ్లుగా పుష్ప మూవీస్ తో బిజీగా ఉండటంతో, సొంతూరు రాలేదు సుకుమార్. ఇప్పుడు కాస్త తీరిక దొరకడంతో సొంతూరు వచ్చాడు సుకుమార్.

పుష్ప-2 అఖండ విజయం తనని సంతోష పెట్టిందని చెబుతూనే, త్వరోలనే రామ్ చరణ్ తో సినిమాను ప్రారంభించబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. మొత్తానికి సుకుమార్ క్లారిటీ ఇవ్వడంతో మెగా కన్ ఫ్యూజన్ కు తెరపడింది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తోన్న పెద్ది వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ అవుతుంది. పెద్ది రిలీజ్ తర్వాతే చరణ్, సుకుమార్ సినిమా సెట్స్  పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి

error: Content is protected !!