
ఒక ఆచార్య, ఒక గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్స్ చూసిన తర్వాత, బాక్సాఫీస్ రేస్ లో వెనుక పడ్డ తర్వాత, చరణ్ లో మామూలు కసి పెరగలేదు. బుచ్చిబాబు అనే యువ దర్శకుడితో, పెద్దిగా బాక్సాఫీస్ ముందుకు వచ్చి, రికార్డులను అన్నిటిని సెట్ చేయాలనుకుంటున్నాడు. అయితే బాక్సాఫీస్ కంటే ముందు, ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు సెట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అదే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ఓటీటీ డీల్ వంద కోట్లకు పైగానే కుదిరిందట. ఒక వైపు ఓటీటీ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిన దశలో, చరణ్ చిత్రానికి వంద కోట్లకు పైగా ఓటీటీ డీల్, అది కూడా నెట్ ఫ్లిక్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ నుంచి అంటే, చిన్న విషయం కాదు.
పెద్ది అన్ని భాషలకు కలపి, ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ 110 కోట్లకు దక్కించుకుందట. ప్రస్తుతం ఈ డీల్ టాలీవుడ్ ను మాత్రమే కాదు, టోటల్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. వంద కోట్ల ఓటీటీ డీల్ అంటే, సినిమా నిర్మాణంలో చాలా వరకు పెట్టిన పెట్టుబడి వచ్చేసినట్లే, ఇంకా శాటీలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఓవరాల్ గా పెద్ది ప్రీ రిలీజ్ బిజనెస్ 500 కోట్లు దాటిన ఆశ్చర్యం లేదు.
ఇదంతా కూడా ఒక బ్లాక్ బస్టర్ టీజర్ వల్లే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. బుచ్చిబాబు అండ్ టీమ్ కట్ చేసిన టీజర్, పెద్దికి కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెట్టింది. మొన్నటి వరకు ఐపీఎల్ ను పెద్ది షార్ట్ ఊపేసింది. సినిమా రిలీజ్ , ఆ తర్వాత కూడా ఇదే మేనియా కొనసాగనుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి పెద్ది క్రేజ్ పీక్స్ కు వెళ్లడం ఖాయం.
ఇది కూడా చదవండి