సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత, వెంకటేష్ ఇమేజ్ మరింత పెరిగింది. ఈ దశలో త్రివిక్రమ్ తో సినిమా చేస్తే, ఆ మార్కెట్ నెక్ట్స్ లెవల్ కు వెళ్తుంది. మరో బ్లాక్ బస్టర్ వచ్చి ఖాతాలో పడుతుంది. ఈ సమయంలో వెంకీ అనవసరంగా రానా నాయుడు  సీజన్ -2 రిలీజ్ చేస్తున్నాడని టెన్షన్ పడుతున్నారు విక్టరీ అభిమానులు. కాని వారు ఎంత టెన్షన్ పడినా, ఏం చేయలేరు. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ ఆల్రెడీ రానా నాయుడు సీజన్ -2 కు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసేసింది. జూన్ 13 నుంచి సీజన్ 2 స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది.

రెండేళ్ల క్రితం వచ్చినా రానా నాయుడు సీజన్ వన్ , నెట్ ఫ్లిక్స్ లో సెన్సేషనల్ హిట్ అయినా, వెంకీకి మాత్రం చాలా బ్యాడ్ నేమ్ తెచ్చింది. వెంకటేష్ అంటే అల్టీమేట్ ఫ్యామిలీ స్టార్ అని , అతను ఇలాంటి వెబ్ సిరీస్ లో నటించడం, బూతులు మాట్లాడటం పెద్ద ఎత్తున దుమారం రేపింది. అసలు వెంకటేష్ ఇలాంటి వెబ్ సిరీస్ నటించకుండా ఉండాల్సింది అనే కామెంట్స్ కనిపించాయి. అయినా సరే వెంకీ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు కూడా అదే స్పీడ్ లో సీక్వెల్ రిలీజ్ చేస్తున్నాడు.ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి
error: Content is protected !!