
రాముడు, రావణుడు బాక్సాఫీస్ యుద్ధం ఏంటి అనుకోకండి. ఇది సోషల్ మీడియాలో తిరుగుతున్న స్టోరీ. అదెలా అంటే వచ్చే ఏడాది మార్చి 19న తాను నటిస్తోన్న టాక్సిస్ రిలీజ్ చేస్తాను అన్నాడు. అయితే అదే సమయానికి అంటే ఒక రోజు అటూ ఇటూగా, రణభీర్ కపూర్ కొత్త చిత్రం లవ్ అండ్ వార్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. రణభీర్ కపూర్ ఆయన భార్య ఆలియా భట్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఛావా హీరో విక్కీకౌ షల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇప్పుడు యశ్ ఈ సినిమాకు పోటీగా తన చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. ఇలా ఎందుకు అంటే , అందుకు ఎవరి దగ్గర సమాధానం లేదు. బాలీవుడ్ కు క్లాషెస్ కొత్త కాదు. ఇది కూడా అలాంటి క్లాష్ అనుకోవాలి. అయితే గతంలో షారుఖ్ నటింటిన డంకీ, ప్రభాస్ నటించిన సలార్ పోటీ పడ్డాయి. ఇప్పుడు కూడా అంతే రణభీర్, యశ్ బాక్సాఫీస్ యుద్ధంగా చూడాల్సి ఉంది.
ఇక రామ, రావణ బాక్సాఫీస్ యుద్ధంగా ఎందుకు చెప్పుకొస్తున్నారు అంటే, రామాయణంలో రణభీర్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు. అదే చిత్రంలో రావణుడిగా యశ్ నటిస్తున్నాడు. ఆ విధంగా ఈ సినిమా రిలీజ్ కు ముందే, వెండితెర రాముడు, రావణుడు బాక్సాఫీస్ యుద్ధానికి సిద్దమవుతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.