
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో, రష్మిక కూడా ఒక క్యారెక్టర్ చేస్తోందని కొద్ది గంటలుగా, రూమర్ ఒకటి చెక్కర్లు కొడుతోంది. అయితే నేషన్ ఇందులో, అల్లు అర్జున్ తో సామి సామి, సూసేకీ లాంటి పాటలు పాడటానికి, స్టెప్పులేయడానికి డేట్స్ ఇవ్వలేదట. ఏకంగా లేడీ విలన్ రోల్ చేస్తోందట. అసలే రష్మిక పైగా నెగిటివ్ షేడ్, అసలు ఈ రూమర్ మామూలుగా లేదుగా అంటున్నారు బన్ని ఫ్యాన్స్. పైగా ఈ క్యారెక్టర్ ను దర్శకుడు చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేసాడట. పాన్ ఇండియా వైడ్ గా అతిపెద్ద స్టార్ హీరోయిన్ గా మారిన రష్మిక, ఇప్పుడు కొత్త చిత్రంలో లేడీ విలన్ గా మారడం మాత్రం విచిత్రమే… ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి ఇంకెన్ని రూమర్స్ వినాల్సి వస్తుందో..
ఇది కూడా చదవండి