కెరీర్ లో 70కి పైగా సినిమాలు చేసాడు రవితేజ. మాస్ రాజాగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా అప్పుడప్పుడు ప్రయోగాలు చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. నా ఆటోగ్రాఫ్, రాజా ది గ్రేట్ ఇందుకు ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయోగం చేస్తున్నాడు. కాకపోతే ఈసారి ప్రయోగం అనలేం, ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయనున్నాడు. సూపర్ హీరోగా నటించబోతున్నాడట.

మాస్ రాజా అంటే మాస్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్, అలాంటి హీరోను సూపర్ హీరోగా చూపించాలి అనుకుంటున్నాడు మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. మ్యాడ్ వన్ తో సూపర్ హిట్, ఇప్పుడు మ్యాడ్ 2తో బ్లాక్ బస్టర్ పై కన్నేసాడు కళ్యాణ్. ఇప్పుడు మూడో సినిమా కోసం రవితేజ డేట్స్ లాక్ చేసాడు. పైగా ఇది మామూలు మూవీ కాదు, సూపర్ హీరో సబ్జెక్ట్. ఇందుకోసం సితార ఎంటర్ టైన్ మెంట్స్ రంగంలోకి దిగింది. ఎంత బడ్జెట్ కావాలంటే అంత ఇస్తాను అంటోందట. 2026లోనే ఈ మూవీ రిలీజ్ కానుందట.

ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే మూవీలో నటిస్తున్నాడు. ఆ తర్వాత కిషోర్ తిరుమల మేకింగ్ లో అనార్కలి అనే చిత్రం చేయనున్నాడని ప్రచారం సాగుతోంది. వచ్చే సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ జాతర రిలీజ్ తర్వాత, కిషోర్, కళ్యాణ్ మూవీస్ ను ఒకేసారి  సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు రవితేజ.

error: Content is protected !!