అసలు సమంత సినిమాల్లోనే నటించడం లేదు, ఇక నేషనల్ ఏంటి.. ఇంటర్నేషనల్ ఏంటి అనుకుంటున్నారా.. లేదా టాలీవుడ్, బాలీవుడ్ వదిలేసి, సమంత హాలీవుడ్ వెళ్తోందా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే సమంత నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ తో తనకు ఇంటర్నేషనల్ రికగ్నీషన్ లభించింది. గత ఏడాది సమంత నటించిన సిటడెల్ – హనీ బన్ని వెబ్ సిరీస్ అమెజాన్ లో విడుదలైంది కదా.. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసారు కదా.. 1980- 1990 మధ్య కాలంలో మహిళల పరిస్థితి ఏంటి అనేది ఇతివృత్తంగా తీసుకుని,

తన కుతురును కాపాడుకునే ప్రయత్నంలో సమంత చేసిన సాహసాలు అన్ని ఇన్ని కావు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో సిరీస్ లో నటించింది సామ్. ఇప్పుడీ ఈ సిరీస్ నాన్ ఇంగ్లీష్ సిరీస్ లిస్ట్ లో టాప్ 10 లిస్ట్ లో స్థానం సంపాదించింది. మొత్తం 170 దేశాల్లో ఈ సిరీస్ టాప్ 10 లో ఉండటం విశేషం.

సమంతకు ఇంత పేరు తెచ్చిపెట్టిన వెబ్ సిరీస్ ను చూడలేదు.. చూడాలి అనుకోవడం లేదంటే మీరు నమ్మగలరా .. ఎందుకంటే ఈ సిరీస్ తెరకెక్కుతున్న సమయంలోనే సమంత అనారోగ్యానికి గురైంది. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ను కంప్లీట్ చేసింది. అయినప్పటికీ,వెబ్ సిరీస్ చూడాలనే ఆసక్తితో ఒక దశలో స్ట్రీమింగ్ స్టార్ట్ చేసినప్పటికీ, మొదటి ఎపిసోడ్ దాటి తాను చూడలేకపోయిందట. మళ్లీ పాత అనుభవాలు, అనారోగ్యానికి గురైన రోజులు గుర్తుకు వచ్చి బాధపడిందట అందుకే.. ఇక పై సిటాడెల్ వెబ్ సిరీస్ చూడను అంటోంది సామ్.

error: Content is protected !!