
ఎల్లమ్మ ఏంటి, వెళ్లిపోవడం ఏంట, నితిన్ పరిస్థితి ఏంటని తొందరపడకండి. ఎందుకంటే ఇదో పెద్ద స్టోరీ. బలగం వేణు ఎల్లమ్మ పేరుతో స్క్రిప్ట్ రాసాడు. ముందు నానికి స్టోరీ చెప్పాడు. నాని కూడా చేద్దాం అన్నాడు. కాని అంతలోనే ప్యారడైజ్ కు కనెక్ట్ అయ్యాడు. ఈ మూవీ నుంచి బయటికి వచ్చాడు. ఏంటి దిల్ రాజు బ్యానర్ లో, బలగం వేణు దర్శకత్వంలో సినిమాను వద్దనుకున్నాడు. దాంతో దిల్ రాజు ఈ చిత్రాన్ని నితిన్ దగ్గరికి తీసుకెళ్లాడు. నితిన్ వెంటనే డేట్స్ ఇచ్చాడు. అక్కడితో స్టోరీ కంప్లీట్ కాలేదు.
ఎల్లమ్మ పాత్రలో సాయి పల్లవి నటింపజేయాలని ప్రయత్నించారు. అందుకు సాయి పల్లవి కూడా ఒప్పుకుంది. కాని ఇప్పుడు ఏమైందో ఏమో, సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. మరి నితిన్ పరిస్థితి ఏంటి అంటే, ఏం చేస్తాం మరో హీరోయిన్ డేట్స్ కోసం ట్రై చేస్తాం. అందుకోసం తన స్నేహితురాలు, టాలీవుడ్ మహానటి కీర్తిసురేష్ డేట్స్ అడుగుతున్నాడట నితిన్. నితిన్ , కీర్తి రంగ్ దే కలసి నటించారు. ఇంప్రెస్ చేసారు. అన్ని కుదిరితే ఇప్పుడు మరోసారి కలసి నటించేందుకు సిద్దమవుతున్నారు.