త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. మొన్నటి వరకు త్రివిక్రమ్ మూవీస్ లో పూజా హెగ్డే కనిపించింది. అల వైకుంఠపురములో తర్వాత కూడా గుంటూరు కారంలో పూజా హెగ్డేనే హీరోయిన్. కాని మహేష్ పట్టుబట్టి మరీ, పూజను కాకుండా శ్రీలీలను ఎంపిక చేసేలా చేసాడు.

ఈ సంగతి పక్కనపెడితే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన సూపర్ హిట్స్ లో సమంత లీడ్ హీరోయిన్ గా కనిపించిన సంగతి తెలిసిందే. ఒక అత్తారింటికి దారేది, ఒక సన్ ఆఫ్ సత్యమూర్తి, ఒక అఆ, మూవీస్ వీరి కాంబినేషన్ కు క్రేజ్ పెంచాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో సమంత నటిస్తోందా అని మీరు అనుకోవచ్చు. కాని అది కాదు.

కేవలం సమంతను దృష్టిలో పెట్టుకునే త్రివిక్రమ్ ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కథను రాసాడట. వెంకటేష్ తో మూవీ పూర్తైన తర్వాతే సమంతతో త్రివిక్రమ్ లేడీ ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కిస్తాడట. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తోంది. ఇది కూడా లేడీ ఓరియెంటేడ్ మూవీనే..

ఇవి కూడా చదవండి

error: Content is protected !!