
రాజ్ నిడిమోరు అనే దర్శకుడితో సమంత ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి చేసుకుంటారని, కొద్ది రోజులుగా ఇలాంటి వార్తలను చూస్తూ వస్తున్నాం. అయితే రిలేషన్ పై ఇరువురు ఎటువంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. ప్రేమను కన్ ఫామ్ చేయలేదు. కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి ఫోటోలను మాత్రం షేర్ చేస్తూ వస్తున్నారు. దీంతో మళ్లీ కథ మొదటికి వస్తోంది. సమంత ఓపెన్ అయిపోయిందని, ప్రేమను ఖరారు చేసిందని, ఇక పెళ్లే అనే హెడ్డింగ్స్ తో స్టోరీస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మేం రాస్తున్న స్టోరీ కూడా అలాంటిదే, ఇటీవల ఒక హాలిడే ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు ఇవి. పైగా నిడిమోరు, సామ్ బాగా క్లోజ్ గా ఉన్నారు. దీంతో సమంత ఇన్ డైరెక్ట్ గా రిలేషన్ ను కన్ ఫామ్ చేసినట్లైంది.

మరో వైపు మాత్రం, నిడిమోరు వైఫ్ శ్యామాలి మరోసారి అర్ధం అయ్యి, అర్ధం కాకుండా మెసేజ్ పెట్టింది. మతమేదైనా మన చర్యలు ఇతరులను బాధపెట్టవద్దు కదా అనే అర్ధం వచ్చే విధంగా, పోస్ట్ రాసుకొచ్చింది. అసలు రాజ్ నిడిమోరు సమంతతో ఎందుకు క్లోజ్ గా ఉంటున్నాడు,. మరో వైపు ఆయన భార్య ఇన్ డైరెక్ట్ గా ఎందుకు మెసేజ్ లు పెడుతోంది అనేది ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది.
ఇవి కూడా చదవండి