రివ్యూ – మూవీ

పేరు – సంక్రాంతికి వస్తున్నాం

ఎప్పుడు రిలీజైంది – సంక్రాంతి సీజన్ – జనవరి 14

ఓటీటీ ప్లాట్ ఫామ్ – జీ5 , మార్చి1 నుంచి స్ట్రీమింగ్

బాగుందా… బాగానే ఉంది.

ఒక్కటే మాటలో – ఎంతో ఫన్

ఈసారి సంక్రాంతి పండక్కి విడుదలై, బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అటు గేమ్ ఛేంజర్, ఇటు డాకు మహారాజ్ లాంటి మూవీస్ ను, అటు వసూళ్లలో, ఇటు టికెట్స్ బుకింగ్స్ లో వెనక్కి నెట్టింది సంక్రాంతికి వస్తున్నాం. అందుకే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై తెలుగు ప్రేక్షకులు చాలా ఆశక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. అందుకు తగ్గట్లే ప్రస్తుతం ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన తర్వాత రికార్డులు తిరగరాస్తోంది. ఒక సినిమా బాక్సాఫీస్ దగ్గర, ఓటీటీలో రికార్డులు బద్దలుకొట్టడం చాలా అరుదు. అలాంటి అరుదైన చిత్రమే సంక్రాంతికి వస్తున్నాం.

ఇక ఈ సినిమా గురించి, ఇప్పటికే వందల రివ్యూలు వచ్చి ఉన్నాయి. చాలా మంది క్రిటిక్స్ తమ అభిప్రాయాలు చెప్పి ఉన్నారు . ఆడియెన్స్ అవుట్ రైట్ గా మూవీని బ్లాక్ బస్టర్ చేసారు. థియేటర్ కు వచ్చిన చిత్రం గురించి, ఓటీటీలో రిలీజైన తర్వాత కొత్తగా చెప్పడానికి ఏం ఉండదు. కాని మరోసారి ఓటీటీలో చూసిన తర్వాత, వచ్చిన రివ్యూ ఇది.

నిజానికి ఈ సినిమా కథ లేదు. కామెడీ మూవీలో కథను వెతకడం అనేది పిచ్చి పని మరొకటి ఉండదు. లాజిక్స్ పక్కనపెట్టి ప్రేక్షకులే ఈ చిత్రాన్ని 300 కోట్లు దాటించారు. అలాంటి సినిమా ఓటీటీలో రిలీజైన తర్వాత ప్లస్సులే హైలైట్ అవుతాయి. మైనస్ లు తక్కువగా కనిపిస్తాయి. ఇది పూర్తిగా అనిల్ రావిపూడి మూవీ, వెంకీ బలాన్ని సరిగ్గా వాడుకుని, ఆడియెన్స్ కు కావాల్సిన ఫన్ ను మరోసారి పర్ఫెక్డ్ గా సెర్వ్ చేసాడు అనిల్ రావిపుడి, సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు అనిల్. అందుకు తగ్గట్లే వెంకటేష్ రెచ్చిపోయాడు. ఎఫ్ 2, ఎఫ్3 లాంటి మూవీస్ ఈ కాంబినేషన్ కు క్రేజ్ పెంచాయి. సంక్రాంతికి వస్తున్నాంతో ఆ క్రేజ్ ను మరోసారి  క్యాష్ చేసుకున్నారు వీరిద్దరు. తాను రాసుకున్న పాత్రలకు నటీనటుల ఎంపికను అద్భుతంగా చేసాడు అనిల్ రావిపూడి.

హీరోయిన్స్ లో ఐశ్వర్యారాజేష్ నటన చాలా సహజంగా ఉంది. తనలో అద్భుత నటిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. రానున్న రోజుల్లో తెలుగు తెరపై ఐశ్వర్య మరిన్ని ఆఫర్స్ తో దూసుకుపోయే అవకాశం ఉంది. ఇక మాస్టర్ రేవంత్ బుల్లెబ్బాయ్ నటన అనేది సినిమా చూసేవారికి సర్ ప్రైజ్. గతంలో ఓ జంధ్యాల చిత్రంలో వచ్చిన ఒక పాత్రను స్ఫూర్తిగా తీసుకుని, అనిల్ బుల్లెబ్బాయ్ పాత్రను కథలోకి తీసుకొచ్చాడు. మరోసారి ఈ పాత్ర ప్రేక్షకులను నవ్వించింది. వారికి బాగా నచ్చింది.

సాయి కుమార్ వాయిస్ ను పట్టుకుని పీల గొంతు అంటూ ఉపెంద్ర చెప్పే డైలాగ్ మరో హైలైట్. తమిళ నటుడు గణేష్ పెర్ఫామెన్స్ కూడా బాగుంది. మొత్తంగా రేవంత్, ఉపేంద్ర, గణేష్ ఈ సినిమాలో సర్ ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పవచ్చు. ఇక అనిల్ కామెడీ సబ్జెక్ట్ కు, సంగీత దర్శకుడు భీమ్స్ అందించిన సంగీతం పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. మొత్తంగా మరోసారి తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు అనిల్ రావిపూడి. కామెడీ టైమింగ్స్ లో వెంకీ మరోసారి తన మార్క్ రిపీట్ చేసాడు. అందుకే ఈ సినిమా ఏ ప్లాట్ ఫామ్ అయినా రికార్డులు తిరగరాస్తోంది. 2027 సంక్రాంతికి మళ్లీ సంక్రాంతికి తిరిగొస్తున్నాం చిత్రం విడుదల కానుంది. మరోసారి బాక్సాఫీస్ సంచలనాలు సృష్టించాలని ఆశిద్దాం.

ఇవి కూడా చవవండి..

error: Content is protected !!