
సినిమా పేరు – షణ్ముఖ
నటీ నటులు – ఆది సాయి కుమార్, అవికాగోర్, ఆదిత్య ఓం, చిరాగ్ జానీ, తదితరులు.
సంగీతం – రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ – ఆర్.ఆర్.విష్ణు
దర్శకత్వం – షణ్ముగం సప్పని
విడుదల తేదీ – 21.03.2025
ఇంతకీ సినిమా ఎలా ఉంది- బాటమ్ లైన్ చూడండి
ప్రైడ్ తెలుగు పంచ్ లైన్ – డిఫరెంట్ అటెంప్ట్
హారర్ థ్రిల్లర్ జానర్ లో చాలా సినిమాలు వస్తుంటాయి. కాని ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ ముందుకు వచ్చిన షణ్ముఖ, రీసెంట్ టైమ్స్ లో వచ్చిన హారర్ థ్రిల్లర్ జానర్స్ లో ది బెస్ట్ అని చెప్పాలి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఆది సాయి కుమార్ తిరిగి షణ్ముఖ చిత్రంతో, ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతను ఇంత సమయం తీసుకుని, ఇదే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అంటే, కథపై అంత నమ్మకంగా ఉండాలి అనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పైగా అవిగా గోర్ కథానాయిక కావడం, తనే కథను నడిపించడంతో ఈ సినిమా మరింత ఆశక్తికరంగా మారింది.
అసలు కథేంటి ? ఆరు ముఖాలతో పుట్టిన తన బిడ్డని మామూలు మనిషిగా మార్చాలి అనే ప్రయత్నమే.. షణ్ముఖ సినిమాకు కథగా మారుతుంది. తన బిడ్డను సాధారణ మనిషిగా మార్చేందుకు చిరాగ్ జానీ క్షుద్ర శక్తులను ఆశ్రియిస్తాడు. వివిధ రాశుల్లో పుట్టిన ఆరుగురు యువతుల బలి ఇచ్చేందుకు సిద్దమవుతాడు. అయితే వీరితో పాటు ఆరు రాశుల్ని తన చుట్టూ తిప్పుకునే శక్తులున్న అవికాగోర్ ను కూడా కొన్ని శక్తులు కోరుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇదే సమయంలో గతంలో తాను బ్రేకప్ చెప్పిన ఆదిసాయి కుమార్, తన లైఫ్ లోకి రీఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత కథ ఏ మలుపు తిరిగింది ? పోలీస్ ఆఫీసర్ అయిన ఆది సాయికుమార్, ఈ కేసును, క్షుద్ర శక్తులను ఎలా దాటుకుని ముందుకొచ్చాడు ? అనేది మిగితా కథ.
హైలైట్స్ – పూర్తిగా మాయలు మంత్రాలతో నిండిపోయిన కథ ఇది. అందుకే అనుక్షణం ఉత్కంఠను కలిగిస్తుంది. షణ్ముఖ జననం, మదర్ సెంటిమెంట్ సినిమాలో హైలైట్. వరుస కిడ్నాప్స్ మూవీని సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా మార్చాయి. ఇక అడవుల్లో క్షుద్ర పూజలు సాగుతున్న తీరు ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లాయి.
ఆది నటుడిగా మరింత పదునెక్కాడు. ఎస్సై కార్తిక్ గా అదరగొట్టాడు. సినిమాలో తన స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది. గత చిత్రాలతో పోలిస్తే మరింత రఫ్ అండ్ టఫ్ గా కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ లో కాలేజీ కుర్రాడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. అవికా గోర్ ఇప్పటికీ అలాగే ఉంది.
నటనలో తన మార్కులు తాను అందుకుంది. ఇక ఆదిత్య ఓం, చిరాగ్ జానీ, కృష్ణుడు, చిత్రం శ్రీను లాంటి నటి నటులు నటన కథకు బలాన్ని సమకూర్చింది. మొత్తంగా దర్శకుడు తనదైన కథ, కథనంతో, షణ్ముఖను ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాడు.
ఈ మధ్య కాలంలో వీఎఫ్ ఎక్స్ ను ఇంత బాగా ఉపయోగించుకున్న చిత్రం ఇదే. కాబట్టి డోన్ట్ మిస్.
బాటమ్ లైన్ – ప్రైడ్ తెలుగు రేటింగ్ – 3.5/5