హీరోయిన్ గా కెరీర్ ను ఏళ్లకు ఏళ్లు కొనసాగించడం కష్టం. కాని తమన్నా మాత్రం, ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ, ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ వస్తోంది. మిల్కీ బ్యూటీగా తన కంటూ సెపరేట్ క్రేజ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ  ఇండస్ట్రీ, ఆ  ఇండస్ట్రీ అనే సంబంధం లేకుండా మూవీస్, ఈ ఓటీటీ , ఆ ఓటీటీ అనే తేడా లేకుండా వెబ్ సిరీస్, వెబ్ మూవీస్ చేస్తూ, తిరుగులేని కథానాయికగా వెలిగింది. ప్రస్తుతం బ్రేకప్ తో మిల్కీ మూడ్ బాగోలేదని చెబుతున్నారు. కాని మూడ్ సరిగ్గా లేనప్పుడే, కెరీర్ పై ఫుల్లుగా ఫోకస్ పెట్టాలనిపిస్తుంది.

గతంలో చాలా మంది చేసిన పని ఇదే. అందుకే తమన్నా ఇప్పుడు ఎవరూ ఊహించని ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే డాకు మహారాణి క్యారెక్టర్. డాకు మహారాణి అంటే, డాకు మహారాజ్ మూవీకి సీక్వెల్ అనుకుంటున్నారా.. కానేకాదు.. బాబికి ఆ ఆలోచన ఉందో లేదో తెలియదు కాని, తమన్నా మాత్రం బాలయ్య నటించే కొత్త చిత్రంలో కథానాయికగా ఎంపిక అయిందట.

అందుకే స్టోరీకి ఈ టైటిల్ పెట్టాం. హీరోయిన్స్ అందరూ సీనియర్ హీరోయిన్స్ తో నటించేందుకు ఆసక్తి చూపించరు. కాని తమన్నా మాత్రం అలాంటి కండీషన్స్ ఏం పెట్టుకోలేదు. వెంకీతో ఎఫ్ 2, ఎఫ్ 3 మూవీస్, అలాగే చిరుతో భోళాశంకర్ మూవీస్ చేసి మెప్పించింది.

ఇప్పుడు బాలయ్య హీరోగా తెరకెక్కే కొత్త చిత్రంలో, అంటే గోపీచంద్ మలినేని తెరకెక్కించబోయే మూవీలో, హీరోయిన్ గా నటించనుందట. మరోవైపు తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ఓడెల సీక్వెల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

error: Content is protected !!