
ఎట్టకేలకు తమిళ హీరో విశాల్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. మరో నటి ధన్సిక మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఈ విషయాన్ని వారే ఒక కొత్త సినిమా ఆడియో వేడుకలో రివీల్ చేసేసాడు. పైగా వచ్చే ఆగస్ట్ 29న వివాహం జరగనుందని, ఎవరూ ఊహించని విధంగా మ్యారేజ్ డేట్ కూడా రివీల్ చేసారు.
ఆగస్ట్ అంటే ఇది ఇంకా చాలా సమయం ఉంది. ఇంత త్వరగా పెళ్లి డేట్ ను ఎలా ఫిక్స్ చేసేసుకున్నారు అంటే ఆ డేట్ కు అంత ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే ఆరోజు విశాల్ పుట్టినరోజు. ఆగస్ట్ 29న విశాల్ బర్త్ డే. అందుకే అదే రోజు విశాల్ తన మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడని ధన్సిక చెప్పుకొస్తోంది. విశాల్ కు దక్షిణాది మొత్తం అభిమానులు ఉన్నారు. ఇక ధన్సిక కబాలి చిత్రంతో సౌత్ మొత్తం ఫేమస్ అయింది. ఇప్పటికీ హీరోయిన్ గా బిజీగా ఉంది.
పైగా పెళ్లి తర్వాత కూడా తాను నటిగా కెరీర్ ను కొనసాగిస్తుందని, తాను అద్భుతమైన నటి అని సాక్షాత్తు కాబోయే వరుడు అందరి ముందు చెప్పాడు. అయితే విశాల్, ధన్సిక కలసి నటిస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. మరి ఆ కోరికను విశాల్ ఎప్పుడు ఎలా నెరవేరుస్తాడు అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం విశాల్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ డిటెక్టివ్ , అభిమన్యుడు మూవీస్ కు సీక్వెల్స్ తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడు. వీటిల్లో ఒక సినిమాలో ధన్సిక కనిపించే అవకాశాలు లేకపోలేదు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి