చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం తండేల్. ఫిబ్రవరి 7న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నెల 23న మూవీ నుంచి మూడో సింగిల్ రిలీజ్ కానుంది. హైలెస్సో హైలెస్సా పాట విడుదల కానుంది. అందులో నుంచి రిలీజైన పోస్టరే ఇది. నాగ చైతన్య, సాయి పల్లవి జోడి మరోసారి కనువిందు చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చుతున్న పాటలు, సెన్సేషన్ కు మారుపేరుగా మారాయి. మరి హైలెస్సో హైలెస్సా పాటకు రాక్ స్టార్ ఎలాంటి ట్యూన్ అందించాడు అనేది తెలియాలి అంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. దాదాపు 100 కోట్లతో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.

error: Content is protected !!