పాత కార్ల అమ్మకాలు లో దేశ వ్యాప్తంగా  లక్షల యూనిట్లు దాటాయని లెక్కలు చెబుతున్నాయి. మరో ఐదేళ్లలో ఈ సంఖ్య ఏటా కోటి యూనిట్లు దాటుతుందని కార్స్ 24 నివేదిక విడుదల చేసింది. పాత కార్ల క్రయవిక్రయాల్లో ఉన్న కార్స్ 24 విడుదల చేసిన ఈ నివేదిక , యూజ్డ్ కార్స్ కొనుగోలు వైపు ఆశక్తిగా ఉన్న కష్టమర్స్ కు కొంత రిలీఫ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా నగరాల్లో,పలు పట్టణాల్లో పాత కార్లకు బాగా డిమాండ్ పెరిగింది. మారిన లైఫ్ స్టైల్ కు అనుగుణంగా తమ ప్రాధాన్యతలకు తగ్గట్లు అందుబాటులో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల వైపు కష్టమర్లు మొగ్గు చూపుతున్నారట. ఈ విషయంలో 16.7 శాతం వాటాతో ఎస్ యూ వీలు మార్కెట్ లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయట.  కోవిడ్ తర్వాత వ్యక్తిగత కార్లకు డిమాండ్ పెరిగిందని నివేదిక చెబుతోంది. మెట్రో, నాన్ –మెట్రో నగరాల్లో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్ గా  మారుతీ సుజుకీ స్విఫ్ట్ అవతరించింది. ఆ తర్వాత శాంట్రో, టాటా వారి టియాగో, వ్యాగన్ ఆర్ మోడల్లు సేల్స్ లో ముందున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో అమ్ముడుపోతున్నాయట.  

error: Content is protected !!