సెప్టెంబర్ 25న  పవన్ కళ్యాణ్ కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా మూవీ టికెట్ ప్రీసేల్స్ లో రికార్డ్స్ అన్నిటిని కూడా చెరిపేస్తోంది. గతంలో ఏ తెలుగు సినిమా కొల్లగొట్టని కలెక్షన్స్ ను చూస్తోంది. ఈ సంగతి పక్కనపెడితే,ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను హైదరాబాద్, విజయవాడల్లో నిర్వహించాలి అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఏపీ సంగతి తెలియదు కాని, హైదరాబాద్ ఈవెంట్ కు మాత్రం పనవ్ కోసం చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని సమాచారం. అదే జరిగితే మెగాభిమానులకు పండగే.. చిరు, పవన్ ఒకే వేదికపై కలసి కనిపిస్తే, అదీ ఓజీ రిలీజ్ కు ముందు, అంటే మెగా ఫ్యాన్స్ కు కాస్త ఎర్లీగానే ఫెస్టివల్స్ మొదలైనట్లే.. తమ్ముడిపై, అన్న ప్రేమను ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కాని ఈసారి మాత్రం పవన్ జోడు గుర్రాల స్వారీ చేస్తూ, అటు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజా సేవ చేస్తూ, జనసేన పార్టీని నడిపేందుకు  సినిమాలు చేస్తూ, నిండా తీరిక లేకుండా, దూసుకుపోతున్నారు.

ఈ దశలో తమ్ముడి గురించి అన్నయ్య ఏం చెబుతారు.. అందుకు తమ్ముడు ఎలా స్పందిస్తారు.. ఇదంతా కూడా ఇప్పుడు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. మెగాభిమానులకు నిద్రను దూరం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!