పహల్గాంలోని బైసరన్ లో అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు ఉగ్రవాదులు. ఈ దాడి చేసింది తామే అని ద రెసిస్టెన్స్ ఫ్రెంట్ అనే ఉగ్ర సంస్థ చెప్పుకుంది. అసలు ఈ ఉగ్ర వాద సంస్థ ఎప్పుడు పుట్టుకొచ్చింది అంటే,ది పాక్ సృష్టించిన సంస్థే అని చెబుతున్నారు.

పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ నే ద రెసిస్టెన్స్ ఫ్రెంట్ ను సృష్టించిందని నిఘా వర్గాలు చెబుతున్న సమాచారం. లష్కరే తొయిబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు, ఏర్పాటు చేసిందే ఈ ద రెసిస్ఠెన్స్ ఫ్రెంట్. కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఏర్పడిందే ఈ సంస్థ.

కశ్మీరీ మిలిటెంటు, షేక్ సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్ నాయకత్వంలోనే ఈ సంస్థ పని చేస్తోంది. నిజానికి ఇతని చేతుల్లోనే ఈ మిలిటెంట్ సంస్థ పురుడు పోసుకుంది.గతంలో లష్కరే తోయిబా కమాండర్ గా సైతం పని చేసాడు.  2020లో నియంత్రణ రేఖ వెంబడి కుప్వారాలోని కేరన్ సెక్టార్ లో నాలుగు రోజుల పాటు ఎదురు కాల్పులు జరిగినప్పుడు తొలిసారి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరు వినిపించింది. నాటి నుంచి ఈ ఉగ్ర వాద సంస్థ దేశంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.

మొదట ఆన్ లైన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించింది. ఆ తర్వాత లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థల నుంచి సభ్యులను తీసుకుని, గ్రూపుగా ఏర్పడింది. దీని వెనుక , ముందు, అంతా కూడా పాకిస్థాన్ ఉంది. సంస్థ ఏర్పాటు అయినప్పటి  నుంచి దాడులకు దిగుతానే ఉంది. కశ్మీర్ ప్రాంతంలో ఉనికి చాటుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీంతో 2023 లోనే ద రెసిస్టెన్స్ ఫ్రెంట్ ను ఉగ్ర సంస్థల జాబితాలో భారత్ చేర్చింది. నాటి నుంచి ఈ గ్రూప్ రగిలిపోతూనే ఉంది.

error: Content is protected !!