బలగం లాంటి తిరుగులేని బ్లాక్ బస్టర్ తీసిన వేణుకు, తర్వాతి చిత్రాన్ని తీసేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడా.. ఏ హీరో దగ్గరికి వెళ్తున్నా కథ నచ్చుతోంది.. డేట్స్ ఇస్తున్నాడు.. కాని షూటింగ్ కు వచ్చే సరికి సారీ చెబుతున్నాడా.. ముందు నాని ఎల్లమ్మ చిత్రంలో నటించాల్సి ఉంది. కాని నేచురల్ స్టార్ తప్పుకోవడంతో, నితిన్ ఈ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టాడు. కాని ఇప్పుడు నితిన్ కూడా ఎల్లమ్మ నుంచి తప్పుకున్నాడని వార్తలు మొదలయ్యాయి. అందుకు నితిన్ వరుస ఫ్లాపుల్లో ఉండటమే రీజన్ అని ప్రచారం కూడా సాగుతోంది.

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు ఒకరు శర్వానంద్, మరొకరు కార్తి. నిజానికి ఎల్లమ్మ కథను వేణు ఎప్పుడో సిద్ధమ చేసాడు. అయితే ఈ సినిమాకు 70 కోట్ల బడ్జెట్ అవసరం ఉండటం, అంత భారీ స్థాయిలో బిజినెస్ చేసే హీరో అవసరం ఉండటంతోనే, ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది.

ముఖ్యంగా నితిన్ మార్కెట్ కుప్పకూలడంతో, దిల్ రాజు కు మరో ఆప్షన్ లేకపోయింది. ఎందుకంటే ఇంచుమించు అంతే బడ్జెట్ తో తెరకెక్కిన తమ్ముడు బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది. అందుకే దిల్ రాజు ఎల్లమ్మ కథకు మార్కెట్ లో మంచి మార్కెట్ ఉన్న హీరో కోసం వెదుకుతున్నాడు. కార్తితో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తే సౌత్ మొత్తం వసూళ్లు ఉంటాయి.

ప్రాజెక్ట్ కు లాభాలు వస్తాయి అనేది దిల్ రాజు ప్లాన్ గా కనిపిస్తోంది. అయితే నాని ఎందుకు ఎల్లమ్మ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు అనేది అర్ధం కాకుండా ఉంది. నాని నటించి ఉంటే, అసలు వేణుకు, దిల్ రాజు కు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు కదా..

ఇవి కూడా చదవండి

error: Content is protected !!